అఖండ సినిమా తర్వాత బాలయ్య (Balakrishna ) వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. జనవరి 12, 2023 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది. Veera Simha Reddy Trailer (Photo Twitter)
మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్గా చేస్తోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ (Veera Simha Reddy Trailer) విడుదలైంది. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే ట్రైలర్ కేక పెట్టించింది. ఊరమాస్ డైలాగ్స్‌తో పాటు, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్లో బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్‌తో పాటు భారీ మాస్ యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సన్నివేశాలు అదిరాయి.
బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో టాక్ షోలు కూడా చేస్తున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఓటిటి టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 దూసుకు పోతుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకులతో సహా చాలా మంది ప్రముఖులు ఈ షో కి అతిథులు గా విచ్చేశారు. ఇప్పుడు ఆహా వీక్షకుల కోసం ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది.
ఈసారి బాలయ్య షోకు వీర సింహా రెడ్డి టీం రానుంది. ఆహా వాళ్లు ముందుగా ప్రకటించినట్లుగా, రాబోయే ఎపిసోడ్లో వీరసింహా రెడ్డి టీమ్ కనిపించనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆహా మేకర్స్ విడుదల చేశారు. ఈ షోలో వీరసింహా రెడ్డి దర్శకుడు గోపిచంద్ మలినేని, నటి వరలక్ష్మీ శరత్ కుమార్, మైత్రీ మూవీ మేకర్స్ వారు సందడి చేసే పిక్స్ నెట్టింట విడుదల చేశారు.
మరోవైపు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక సెన్సార్ టాక్ ను బట్టి సినిమా పాజిటివ్ గానే సాగిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ థియేటర్ లో పూనకాలు తెప్పిస్తాయని అంటున్నారు.నందమూరి అభిమానులు ఒక్కరు కూడా సీట్లలో కూర్చోరని, బాలయ్య డైలాగ్స్ కు అరిచిఅరిచి గొంతులు పోతాయని అంటున్నారు Veera simha reddy Twitter