మెగా వరుణ్ తేజ్ (Varuntej) హీరోగా తాజాగా తెరకెక్కిన సినిమా గని. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గని’ (Ghani) సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేశారు. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. నదియా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో కనిపించారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో ‘గని’ ఫలితంపై వరుణ్‌తేజ్ ఏమోషన్ అవుతూ ఓ పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన ఓ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
వరుణ్ తేజ్ తను విడుదల చేసిన నోట్లో రాస్తూ.. గత కొన్ని సంవత్సరాలుగా నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. గని సినిమాలో భాగమైన ప్రతిఒక్కరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నా నిర్మాతలు ప్రాణం పెట్టి గని సినిమాను రూపోందించారు. ఓ మంచి చిత్రాన్ని ఇవ్వడం కోసం టీమ్ ఎంతో కష్టపడింది. అయితే మేము అనుకున్న కొన్ని ఆలోచనలు, ఐడియాలు సరిగా తెరకెక్కించలేకపోయాం. ప్రతి సినిమా మీకు నచ్చాలనే ఉద్దేశంతోనే చేస్తాను. ఆ క్రమంలో కొన్నిసార్లు నేను విజయం సాధిస్తాను. మరికొన్నిసార్లు ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. ఏది ఏమైనా ఏ సినిమాకైనా, ఎప్పుడైనా కష్టపడి పనిచేయడాన్ని మాత్రం విడవను అంటూ రాసుకున్నారు వరుణ్ తేజ్. Photo : Twitter
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా పూర్తి రన్లో నాలుగు కోట్లు కూడా కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాకు 25.3 కోట్లలో రేంజ్ బిజినెస్ జరగగా.. 26.30 కోట్ల రేంజ్టార్గెట్తో బరిలోకి దిగింది. కాగా ఈ సినిమా మొదటి రోజు నుంచే ట్రాక్ తప్పింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. Photo : Twitter
ఇక ఈ సినిమా రెండో రోజు 1.3 కోట్ల రేంజ్ అయిన కలెక్షన్స్ ని అందుకుంటుందనుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 72 లక్షల రేంజ్లో షేర్‌ను అందుకుని షాక్ ఇచ్చింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల విషయానికి వస్తే… ప్రపంచవ్యాప్తంగా 3.39 షేర్‌ను అందుకుందని అంటున్నారు. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలంటే ఇంకా 26.30 కోట్ల రేంజ్లో షేర్‌ను అందుకోవాల్సి ఉంది. అయితే అది అసాధ్యం అంటున్నారు సినీ పండితులు. దీంతో వరుణ్ తేజ్‌కు భారీ ప్లాప్ గని రూపంలో వచ్చిందని.. బాధపడుతున్నారు ఆయన ప్యాన్స్. . Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా దక్కించుకుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏప్రిల్ నెలలోనే స్ట్రీమింగ్ తీసుకురానున్నట్టు టాక్. ఈ సినిమా మరో 20 రోజుల్లో అంటే ఈ ఏప్రిల్ 29న ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చే అవకాశం రానుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మించారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 2న విశాఖపట్నంలో అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా ఘనంగా జరిగింది. విడుదలకు రెడీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ కలిపి రూ. 25 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఇక వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనను తాను మార్చుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ (Varun Tej).. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చారు. Photo : Twitter
ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు నటించారు.’గని’ (Ghani) మూవీకి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉంది. ‘గని’ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇప్పటికే విశాఖ పట్నంలో ఒక ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన చిత్ర యూనిట్.. హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్లో మార్చి 6న రిలీజ్ పంచ్ అంటూ మరో వేడుకను నిర్వహించారు. Photo : Twitter
ఇక వరుణ్ తేజ్ ‘గని సినిమాతో పాటు వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. Photo : Twitter