ఇక లేటెస్ట్గా ఈ ఇద్దరి ప్రేమ విషయాన్ని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బయట పెట్టారు. తన లేటెస్ట్ సినిమా ‘తోడేలు’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు, దీపికా పడుకోణెతో షూటింగ్లో ఉన్నాడంటూ బాంబ్ పేల్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Prabhas and Kriti Twitter
తాజాగా వరుణ్ ధావన్ కూడా కృతి సననన్ చేసిన పోస్టుపై స్పందిస్తూ... కామెంట్లు చేశాడు. మేం ఏదో అంటే దాన్ని ఛానల్స్ అన్నీ మరోలా ప్రజంట్ చేశాయని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. అవన్నీ రూమర్స్ వాటిని నమ్మకండి అంటూ... వరుణ్ ధావన్ చెప్పడం విశేషం. దీంతో ఇప్పుడు కృతి, వరుణ్ చేసిన పోస్టులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వాటిని స్క్రీన్ షాట్లు తీసి మరి నెటిజన్లు జోరుగా వైరల్ చేస్తున్నారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ఆదిపురుష్ అనే ఇతిహాసంతో తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేస్తామని... ఓంరౌత్ ప్రకటించారు.