జబర్దస్త్ కామెడీ షో అంటే ఒకప్పుడు కేవలం అబ్బాయిలకు మాత్రమే అనేలా ఉండేది. అయితే కొన్నేళ్లుగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో బూతులు, కొట్టుకోవడాలు ఉండేవని అమ్మాయిలను దూరం పెట్టారు. అబ్బాయిలే లేడీ గెటప్స్ వేసారు. కానీ ఇప్పుడు అలా కాదు.. అమ్మాయిలు వచ్చేసారు. లేడీ కమెడియన్స్ అక్కడ బాగానే సత్తా చూపిస్తున్నారు. ఇంతకు ముందు చాలా సీరియల్స్, షోస్ చేసినా రాని గుర్తింపు వాళ్లకు.. బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో వచ్చింది. అలా పాపులర్ అయిన ఫిమేల్ కమెడియన్లు ఎవరో ఓ సారి చూద్దాం..
వర్ష: ఈమె సీరియల్స్ చాలానే చేసింది. అయినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో జబర్దస్త్ షోకు వచ్చింది. సీరియల్స్ తీసుకురాలేని గుర్తింపు జబర్దస్త్ తీసుకొచ్చింది. ప్రస్తుతం అటు జబర్దస్త్ చేస్తూనే.. ఇటు సీరియల్స్ కూడా చేసుకుంటుంది వర్ష. మరోవైపు హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో అందాలను ఆరబోయడం వర్ష స్పెషాలిటీ.
షాబీనా షేక్: బుల్లితెర నుంచి జబర్దస్త్ వైపు అడుగులు వేసిన మరో నటి షబీనా. ఈమె బుల్లితెర ప్రేక్షకులకు బాగానే పరిచయం. కస్తూరితో పాటు మరికొన్ని సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓసారి కెవ్వు కార్తీక్ స్కిట్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఇక్కడ ఆమె పర్మినెంట్ అయిపోయింది. వరసగా స్కిట్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
రీతూ చౌదరి: జీ తెలుగులో సింగర్ యశస్విని స్టేజీమీదే కౌగిలించుకుని బాగా పాపులర్ అయింది రీతూ చౌదరి. ఆ తర్వాత హైపర్ ఆది స్కిట్స్‌లో జబర్దస్త్‌లో బాగా పాపులర్ అయింది. లేడీ కమెడియన్స్‌లో ఈమెపైనే భయంకరంగా పంచులు పడుతుంటాయి. అయినా కూడా బాగా రిసీవ్ చేసుకుని నవ్విస్తుంటుంది. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు లేడీ కమెడియన్స్ కూడా జబర్దస్త్ కామెడీ షోలో మాయ చేస్తున్నారు.