ఇక ఈ సినిమాలో తన భానుమతి పాత్రను అంత గొప్పగా డిజైన్ చేసిన గోపీచంద్ మలినేనికి స్పెషల్ థాంక్స్ అని చెప్పిన వరలక్ష్మి.. చిత్రంలోని ఇంటర్వెల్ సీన్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ఇంటర్వెల్ బ్లాక్ లో తాను బాలయ్య బాబును పొడిచేసే సీన్ చూసి.. ఆయన అభిమానులు చంపేస్తారేమోనని భయపడ్డానని వరలక్ష్మి చెప్పింది. అయితే ఫ్యాన్స్ విషయంలో బాలయ్య బాబు ధైర్యం చెప్పారని, ఆయన చెప్పిందే జరిగిందని ఆమె తెలిపింది.