Karthika Deepam: బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు వస్తుంది. అంతేకాకుండా సెలబ్రిటీలకు కూడా అభిమాన సీరియల్ గా మారింది. ఇక కొన్ని రోజుల కిందట వంటలక్క, డాక్టర్ బాబు కలుసుకుంటున్న సమయంలో మంచి రేటింగ్ సంపాదించుకుంది. కానీ అంతలోనే మోనిత వచ్చింది కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అని చెప్పి షాక్ ఇవ్వడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. దీంతో ఈ సీరియల్ అభిమానులు ఇక దీప, కార్తీక్ లు కలుసుకోవడం సాధ్యం కాదని ఈ ట్విస్ట్ లు చూడటం మా వల్ల కాదని సీరియల్ చూడటమే తగ్గించేశారు. దీంతో గత వారం నుండి రేటింగ్ బాగా దిగజారింది. మరి ఈ సీరియల్ డైరెక్టర్ రేటింగ్ పెంచుకోవడానికి ఏం చేస్తాడో చూడాలి.