Padma Bhushan - Vani Jairam: టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న దర్శకులు సాగర్, కళా తపస్వీ కే.విశ్వనాథ్ కన్నుమూసిన ఘటనలు మరవక ముందే ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో కన్నుమూసారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో గాయనిగా ఈమెకు పేరు తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే.. (Twitter/Photo)
కేవలం తెలుగు సహా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలో వాణీ గొంతు గట్టిగానే వినిపించింది. అక్కడ జయభాదురి ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్డి’ సినిమాలోని పాటలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో రాఘవేంద్రరావు ..జయసుధతో ‘జ్యోతి’పేరుతో రీమేక్ చేసి తొలి సక్సెస్ అందుకున్నారు. (File/Photo)
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ ,మళయాలం, కన్నడ, ఒరియలతో పాటు దాదాపు 14 భారతీయ భాషల్లోనూ 8 వేలకు పైగా పాటలు పాడిన ఘనత వాణీ జయరాం సొంతం. ఆ గానామృతమే ఆమెకు కోట్ల కొద్దీ అభిమానుల్ని సంపాదించిపెట్టాయి. గాయనిగా మూడు జాతీయ అవార్డులు.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పురస్కాలు అందుకున్నారు. ఈమె మృతి తెలుగు సహా దక్షిణాది చిత్రసీమకు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.