Roja - Nayanthara : గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేష్ శివన్‌లు ప్రేమించుకుని ఎట్టకేలకు ఒకింటి వారయ్యారు. వీళ్ల ప్రేమ వ్యవహారం డేలీ ఎసిపోడ్ల బంకలా కొనసాగి ఎట్టకేలకు ఎండ్ కార్ట్ పడింది. ఇక విఘ్నేష్ శివన్ కంటే ముందు నయనతార, హీరో శింబుతో ప్రేమ వ్యవహారం నడిపించింది. ఆ తర్వాత ప్రభుదేవాతో లవ్వాయణం పెళ్లి పీఠలకు వరకు వెళ్లింది. చివరకు ఏమైందో ఏమో వీళ్ల పెళ్లికి చివరల్లో శుభం కార్డు మాత్రం పడలేదు. గతేడాది విఘ్నేష్‌తో ప్రేమను పెళ్లితో ఎండ్ కార్డ్ వేసింది. వీరి పెళ్లి గతేడాది జూన్ 9న జరగింది.
రోజా - సెల్వమణి | రోజా హీరోయిన్.. సెల్వమణి సినీ దర్శకుడు. ఐనా వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక రోజా తన భర్త సెల్వమణి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత రోజా ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక రోజా.. తెలుగు ఆడపడుచు అయితే.. సెల్వమణి మాత్రం తమిళుడు కావడం విశేషం. (Facebook/Photo)
నయనతార కేరళ అమ్మాయి. ఆ తర్వాత దక్షిణాదిలో అగ్ర కథానాయికగా సత్తా చాటింది. ఇక నయన్ ప్రేమ వివాహాం చేసుకునే విఘ్నేష్ శివన్.. కూడా తమిళుడే కావడం విశేషం. ఇక నయనతార కంటే విఘ్నేష్ యేడాది చిన్నవాడు. వీరి పెళ్లి లాస్ట్ ఇయర్ మహాబలిపురంలో జరిగింది. వీరి పెళ్లి హక్కులను నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్కు తీసుకుంది. వీళ్ల కంటే ముందు దర్శకులను పెళ్లాడిన హీరోయిన్స్ విషయానికొస్తే.. (Twitter/Photo)
అమలా పాల్ - AL విజయ్ | తమిళంలో అగ్ర దర్శకుడిగా సత్తా చాటుతున్న ఏ.ఎల్.విజయ్ను అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత విజయ్ కుటుంబ సభ్యులు ఆమెను సినిమాల విషయంలో ఏదో ఇష్యూ వచ్చింది. దీంతో విజయ్‌కు అమలా పాల్ విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం వీళ్లిద్దరు ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. (Twitter/Photo)
యామీ గౌతమ్ (Yami Gautam) కూడా ఓ దర్శకుడిని పెళ్లాడింది. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్‌తో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసింది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది. ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యూరీ.. ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో యామీ గౌతమ్ ముఖ్యపాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)