VALENTINE DAY SPECIAL NOT ONLY NAGA CHAITANYA SAMANTHA AKKINENI THESE ARE THE SOUTH CINE CELEBRITIES TIE KNOT AFTER LOVE TA
పవన్, మహేష్, నాగ చైతన్యలు కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటలు..
Valentines Day 2020 | మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంల కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో కూడా పీపీ..డుండుం...అనేస్తున్నారు.అలా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు సినీ జంటలు (Facebook/Photo)
2/ 36
ఏమాయ చేసావే సినిమాతో ఆటోనగర్ సూర్యను నిజంగనే మాయ జేశిన జెస్సీ...ఆ తర్వాత చైతూతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను ఆఫ్ ది స్క్రీన్ లో కంటిన్యూ చేసి మూడు ముళ్లలతో ఏడడుగులు వేసి ఆలుమగలయ్యారు. (Instagram/Photo)
3/ 36
మహేష్ బాబు,నమ్రత కూడా వంశీ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వారి ప్రేమను పెళ్లితో సుఖాంతం చేసుకున్నారు. (Facebook/Photo)
4/ 36
‘బద్రి’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన వీళ్లిద్దరు.. ఆ తర్వాత ‘జానీ’ సినిమాలో నటించారు. ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేసి పిల్లాడు అకీరానందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్‌కు పెళ్లి చేసుకున్నాడు. (Facebook/photo)
5/ 36
రెండో భార్య రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత ముచ్చటగా అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్. ఈమె పవన్ నటించిన ‘తీన్మార్’ సినిమాలో చిన్నపాత్రలో నటించడం విశేషం. (Twitter/Photo)
6/ 36
సరసాలు చాలు శ్రీవారువేళ కాదు అంటూ రీల్ లైఫ్‌లో సరసం చేసిన నాగార్జున, అమల....ఆ తర్వాత రియల్ లైఫ్లోఆ సరసాలు కంటిన్యూ చేయాలనే నిర్ణయం తీసుకొని ప్రేమయుద్దంలో గెలిచారు. (Facebook/Photo)
7/ 36
తలంబ్రాలు, ఆహుతి,అంకుశం వంటి సినిమాలతో హిట్ పెయిర్ అనిపించుకున్న రాజశేఖర్, జీవిత...ఆ తర్వాతఒకరికొకరు జీవిత భాగస్వాములై వాళ్ల చెరగని ప్రేమకు శ్రీకారం చుట్టారు. (Facebook/Photo)
8/ 36
ఊహాల పల్లికిలో ఊరుగేతోంది ఈ మనసు అంటు ఊరేగిన శ్రీకాంత్,ఊహాలు ఆ తర్వాత నిజజీవితంలో మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. (Facebook/Photo)
9/ 36
సుమంత, కీర్తి రెడ్డి హీరో, హీరోయిన్లు అయినా ఒక్కో సినిమాలో కలిసి నటించలేదు. ఐనా వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. (Facebook/Photo)
10/ 36
‘సాక్షి’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన కృష్ణ,విజయ నిర్మల ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (యూట్యూబ్ క్రెడిట్)
11/ 36
‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటంచిన వరుణ్ సందేశ్, వితికా షేరు ఆ తర్వాత నిజ జీవిత భాగస్వాములయ్యారు. (Twitter/Photo)
12/ 36
ఎన్నో తమిళ, హిందీసిన్మాల్లో కలిసి నటించిన కమల్ హాసన్, సారికలు.. ఆ తర్వాత నిజ జీవితభాగస్వాములయ్యారు. (Facebook/Photo)
13/ 36
ఇక ఎన్నో సిన్మాల్లో కలిసి నటించిన సూర్య,జ్యోతిక ఆ తర్వాత ఒకింటోళ్లు అయ్యారు. (Facebook/Photo)
14/ 36
ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ల లిస్టులో అజిత్, షాలినీ కూడా ఉన్నారు. వీళ్లిద్దరు ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. (Facebook/Photo)
15/ 36
ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటల్లో స్నేహ, ప్రసన్న కూడా ఉన్నారు. (Facebook/Photo)
16/ 36
అటు ఒకింటి వాళ్లు అయిన జంటల్లో రాధిక శరత్ కుమార్ కూడా ఉన్నారు. (Facebook/Photo)
17/ 36
శరత్ కుమార్ కంటే ముందు మొదటగా హీరో ప్రతాప్ పోతన్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది రాధిక. ఆ తర్వాత రిచర్డ్ హార్డితో రెండో పెళ్లి చేసుకుంది. ఆయనకు విడాకులు ఇచ్చిన తర్వాత శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. (Twitter/Photo)
18/ 36
‘సిందూర పువ్వు’ వంటి కొన్ని సినిమాల్లో జంటగా నటించిన నిరోషా, రాంకీలు నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (Facebook/Photo)
19/ 36
తమిళంలో హీరోగా నటించిన పార్థీపన్ తన తోటి హీరోయిన్ సీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. (Facebook/Photo)
20/ 36
కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్, భారతి కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (Facebook/Photo)
21/ 36
ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన అంబరీష్ సుమలత కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (Facebook/Photo)
22/ 36
సావిత్రి, జెమిని గణేషణ్ కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన తర్వాతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (Facebook/Photo)
23/ 36
రోజా హీరోయినైన.. సెల్వమణి సినీ దర్శకుడు. ఐనా వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (Facebook/Photo)
24/ 36
సుహాసిని మణిరత్నం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లలో మణి రత్నం దర్శకుడైతే.. సుహాసిని హీరోయిన్ (Facebook/Photo)
25/ 36
హీరోయిన్ రమ్యకృష్ణను ప్రేమ వివాహాం చేసుకున్న కృష్ణవంశీ (ఫేస్బుక్ ఫోటో)
26/ 36
మలయాళ హిట్ డైరెక్టర్ ప్రియదర్శన్‌ను హీరోయిన్ లిజీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. (Facebook/Photo)
27/ 36
ప్రముఖ నటి సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్.. వీరిద్దరు ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. (Twitter/Photo)
28/ 36
ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి విషయానికొస్తే.. ఎన్టీఆర్ మహానటుడు. కానీ లక్ష్మీ పార్వతి మాత్రం సాధారణ లెక్చరర్. వీళ్లది సినీ జంటగా పరిగణించకపోయినా.. ప్రేమ జంటల్లో వీళ్లు కూడా తమకంటూ ఒక పేజీ సృష్టించుకున్నారు. (Twitter/Photo)
29/ 36
రామ్ చరణ్, ఉపాసనలది కూడా ప్రేమ వివాహామే. వీళ్లిద్దరిట్లో రామ్ చరణ్ మాత్రమే సినీ రంగానికి చెందిన వాడు. (Twitter/Photo)
30/ 36
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (Instagram/Photo)
31/ 36
నాని భార్య అంజనా.. కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తుంది. బెంగళూర్ నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన అంజనా.. ఇప్పుడు రాజమౌళి ఆర్కా మీడియాలో పని చేస్తుంది. వీళ్లది ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. (Twitter/Photo)
32/ 36
భానుమతి, రామకృష్ణ ప్రేమించి వివాహాం చేసుకున్నారు. (Twitter/Photo)
33/ 36
సీనియర్ హీరోయిన్ రాజ సులోచన కూడా సి.ఎస్.రావు ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (Facebook/Photo)
34/ 36
ప్రముఖ సంగీత దర్శకుడు ఆది నారాయణ రావును అంజలి దేవి ప్రేమ వివాహాం చేసుకున్నారు. (Twitter/photo)
35/ 36
ఒకప్పటి సీనియర్ నటి జి.వరలక్ష్మి .. ప్రముఖ దర్శకుడు కే.యస్.ప్రకాష్ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈయన కే.రాఘవేంద్రరావు తండ్రి (Twitter/Photo)
36/ 36
రజినీ కాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమ వివాహాం చేసుకున్న నటుడు ధనుశ్ (Twitter/Photo)