అందులో ఒక సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు ఒకింటివాళ్లు అయిన లిస్టులో బాలీవుడ్ ముందు వరుసలో ఉంటోంది. రీసెంట్గా సిద్ధార్ద్ మల్హోత్ర, కియారా అద్వానీ ఒకింటి వాళ్లైయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీళ్లు చివరకు తమ ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేసారు. వాలైంటెన్స్ డే (ప్రేమికుల రోజు ) సందర్భంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలపై న్యూస్ 18 స్పెషల్ ఫోకస్.. (Instagram/Photo)
మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే నిజమేనని చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంల కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో మూడు ముళ్ల బంధంతో ఒకటైన వాళ్లు చాలా మందే ఉన్నారు.(Twitter/Photos)
విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ |విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో 2011 డిసెంబర్ 9న చాలా రాయల్ స్టైల్లో వివాహం చేసుకున్నారు. విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో చాలా రాజ శైలిలో వివాహం చేసుకున్నారు.. (Twitter/Photo)
రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొణే | గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట 2018 చివర్లో ఒక ఇంటివాయ్యారు దీపికా పదుకొణే, ,రణ్వీర్ సింగ్. వీళ్లిద్దరు 2018 నవంబర్ 14న ఒకింటి వారయ్యారు. పెళ్లైన తర్వాత వీళ్లిద్దరు ‘83’ మూవీలో నటించారు. తొలిసారి వీళ్లిద్దరు చనిపోని పాత్రల్లో నటించడం విశేషం. ఆ తర్వాత రణ్వీర్ సింగ్.. ‘సర్కస్’లో ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది. (Facebook/Photo)