Valentines Day 2023 | మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంలో కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో కూడా పీపీ..డుండుం...అనేస్తున్నారు. (File/Photo)
నాగ చైతన్య సమంత | ఏమాయ చేసావే సినిమాతో ఆటోనగర్ సూర్యను నిజంగనే మాయ జేశిన జెస్సీ...ఆ తర్వాత చైతూతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను ఆఫ్ ది స్క్రీన్ లో కంటిన్యూ చేసి మూడు ముళ్లలతో ఏడడుగులు వేసి ఆలుమగలయ్యారు. వీరి పెళ్లి మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2021 అక్టోబర్ 2న వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనం రేపింది. (Instagram/Photo)
పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ | ‘బద్రి’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన వీళ్లిద్దరు.. ఆ తర్వాత ‘జానీ’ సినిమాలో నటించారు. ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేసి పిల్లాడు అకీరానందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్‌కు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. (Facebook/photo)