కరోనా సమయంలో సినిమాలకు కలెక్షన్స్ రావడమే గొప్ప విషయం. అలాంటిది ప్రతీరోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి కంటే ఎక్కువ షేర్ వసూలు చేయడం అంటే మాటలు కాదు. కానీ కొన్ని సినిమాలు ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఆ రికార్డు చేసి చూపించాయి. 2021లో దాదాపు అరడజన్ సినిమాలకు పైగా ప్రతిరోజు కోటికి పైగా షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించాయి. ఒకటి రెండు రోజులు కాదు.. వరసగా 10 రోజులు.. అంతకంటే ఎక్కువ రోజులు కోటి కంటే ఎక్కువ షేర్ వసూలు చేసాయి. అందులో పుష్ప, అఖండ, వకీల్ సాబ్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఉప్పెన, జాతి రత్నాలు లాంటి సినిమాలు కూడా వరసగా 10 రోజుల కంటే ఎక్కువగానే కోటికి పైగా షేర్ వసూలు చేసాయి.
1. పుష్ప: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగులో కాస్త తక్కువగా వసూళ్లు వస్తున్నాయి. అయితే విడుదలైన తర్వాత వరసగా 11 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కోటి కంటే ఎక్కువ షేర్ వసూలు చేస్తూ వచ్చింది పుష్ప. మొదటి రోజు 24.90 కోట్ల షేర్ వసూలు చేసిన పుష్ప.. 11వ రోజు 1.05 కోట్లు వసూలు చేసింది. 12వ రోజు 69 లక్షలకు పడిపోయింది.
5. జాతి రత్నాలు: నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన జాతి రత్నాలు కూడా సంచలనం రేపింది. 2021లో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 12 రోజుల పాటు వరసగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటికి పైగా షేర్ వచ్చింది. 13వ రోజుకు కానీ కోటి కంటే తక్కువ వసూలు చేయలేదు జాతి రత్నాలు. అనుదీప్ తెరకెక్కించిన ఈ చిత్రం 38 కోట్లు షేర్ వసూలు చేసింది.