ఆ సినిమా ఆమె దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా అమాయకురాలు పాత్రలో ఆమె కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె వరుస ఆఫర్లతో అదరగొడుతోంది. అనన్య త్వరలో విడుదలకానున్న ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. ఇక అది అలా ఉంటే అనన్య ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోందని అంటున్నారు నెటిజన్స్. కొంతమంది నెటిజన్స్ మాత్రం అందంగా కనిపించడం కోసం అనన్య సర్జరీ చేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ విషయంలో నిజం ఎంతో.. Photo : Instagram
అనన్య వకీల్ సాబ్తో పాటు యువ హీరో నితిన్ నటించిన మాస్ట్రో (Nithiin Maestro) అనే సినిమాలో నటించారు. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌తో పాటు సాంగ్స్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. Photo : Instagram
Ananya Nagalla : ఇక 'మాస్ట్రో' డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ (Hotstar ) సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.35 కోట్ల మొత్తానికి డీల్ అయినట్టు టాక్. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించారు. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించింది. Photo : Instagram
ఇక అనన్య నాగళ్ల పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త, అనన్య చదువుల కోసం ఆమె కుటుంబం హైదరాబాద్‌కు వచ్చింది. అనన్య ఇబ్రహీంపట్నంలోని రాజ మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో తన బి. టెక్ పూర్తి చేసింది. ఇక చిత్ర పరిశ్రమలో రాకముందు ఇన్ఫోసిస్‌లో పనిచేసిందని తెలుస్తోంది. . Photo : Instagram
అలా అక్కడ పనిచేస్తూ ఉండగా.. మల్లేషం సినిమాలో అవకాశం వచ్చింది. నటుడు ప్రియదర్శితో కలిసి నటించిన మల్లేశంలో మంచి నటనతో అదరగొట్టింది. ఇక ఆ తర్వాత 2021లో ప్లే బ్యాక్ సినిమాలో కనిపించింది. అదే సంవత్సరంలో ఆమె హిందీ చిత్రం పింక్ రీమేక్ వకీల్ సాబ్‌లో నటించింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఆమె సమంత ప్రధాన పాత్రలో వస్తున్న శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. . Photo : Instagram