Kondapolam : కర్నూలులో ఘనంగా వైష్ణవ్ తేజ్ కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్...

Kondapolam : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన నటించిన రెండో సినిమా కొండపొలం ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రామానికి హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణి, నటులు హేమ, సాయి చంద్ మొదలగు వారు హాజరు అయ్యారు.