మెగా హీరోలతో మల్టీస్టారర్ ఆన్ ది వే..! ఇంట్రెస్టింగ్ సీక్రెట్ చెప్పిన వైష్ణవ్ తేజ్
మెగా హీరోలతో మల్టీస్టారర్ ఆన్ ది వే..! ఇంట్రెస్టింగ్ సీక్రెట్ చెప్పిన వైష్ణవ్ తేజ్
Vaishnav Tej: కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు రంగరంగ వైభవంగా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు వైష్ణవ్.
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు. ఉప్పెనలా వచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు. నటనా పరంగా ఎంతో అనుభమున్న నటుడిలా వెండితెరపై మ్యాజిక్ చేశాడు. అయితే ఆ తర్వాత అదే బాటలో వెళ్లడంలో మాత్రం కాస్త తడబడ్డాడు.
2/ 8
తన రెండో సినిమాగా కొండపొలం చేసిన వైష్ణవ్ తేజ్.. ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు రంగరంగ వైభవంగా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ (Kethika Sharma) హీరోయిన్గా నటించింది.
3/ 8
ఈ చిత్రానికి గిరీశాయ (Gireeshaya) దర్శకత్వం వహించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. సెప్టెంబర్ 2న భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు వైష్ణవ్ తేజ్.
4/ 8
తాజాగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్.. తన మనసులో మాట బయటపెట్టారు. తనకు మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉందని, మెగా హీరోలైన ఇద్దరితో సినిమా చేయాలని అనుకుంటున్నా అంటూ ఓపెన్ అయ్యాడు.
5/ 8
ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నా కానీ సమయం వచ్చినపుడు మెగా ఫోన్ పడతా అని వైష్ణవ్ తేజ్ చెప్పాడు. ఇప్పటికే ఓ కథ కూడా సిద్ధం చేసుకున్నానని, ఆ కథను మల్టీస్టారర్ సినిమాగా అన్నయ్య సాయి తేజ్.. బావ వరుణ్ తేజ్‌లతో చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు.
6/ 8
కొంతకాలం హీరోగా కాకుండా డైరెక్షన్ చేయాలని ఉందంటూ వైష్ణవ్ ఓపెన్ అయ్యాడు. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అని, త్వరలోనే ఆ సమయం రావొచ్చని కూడా అన్నాడు. అంటే మెగా కాంపౌండ్ నుంచి ఇప్పుడు ఓ యువ దర్శకుడు కూడా ఆవిర్భవించబోతున్నాడని చెప్పుకోవచ్చు.
7/ 8
ఇకపోతే వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఫన్ అండ్ రొమాంటిక్‌గా సాగిన ఈ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్ డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.
8/ 8
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో నరేష్, ప్రభు, తులసి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యూత్ ఆడియన్స్ నచ్చే, మెచ్చే సన్నివేశాలతో ఈ మూవీ రూపొందించారని ఇప్పటివరకు వదిలిన అన్ని అప్డేట్స్ కన్ఫర్మ్ చేశాయి.