రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రభాస్ వరుసగా అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది.
అయితే ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను యూవీ క్రియేషన్స్ (UV Creations) వారు అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏకంగా రూ. 100 కోట్లకు కైవసం చేసుకున్నారట. ఒకవేళ చిత్రానికి మంచి టాక్ వస్తే యూవీ వారికి మంచి లాభాలు వస్తాయని వేరేగా చెప్పాల్సిన పనిలేదు
అయితే ప్రభాస్ గత చిత్రాలు ‘సాహో (Saho), రాధేశ్యామ్ (Radheshyam)’లకు భారీ నష్టాలొచ్చాయి. ఈ విషయం అందరికీ తలెిసిందే. అయినప్పటికీ కూడా ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని యూవీ క్రియేషన్స్ ‘ఆదిపురుష్’ చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకోవడం గమనార్హం. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ‘ఆదిపురుష్’ నిలిచిపోనుంది.