తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య, సమంత గురించి టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళెందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచింది వాళ్లు చెప్తూనే ఉన్నారు. మరికొందరు అయితే ఏకంగా డిబేట్స్ పెట్టి.. కచ్చితమైన కారణాలు ఇవే అంటూ కుండ బద్దలు కొడుతున్నారు. సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోలేదని.. సరోగసి వైపు అడుగులు వేసినందుకే చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు చెప్తున్న కారణం.
చైతూ లవ్ స్టోరి సక్సెస్ ఎంజాయ్ చేయడంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నాడు. వీళ్ల విడాకులపై కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కొడుకు విడాకుల గురించి నాగార్జున చాలా ఎమోషనల్ అయ్యాడు. అది పూర్తిగా భార్యాభర్తల వ్యక్తిగత నిర్ణయమని.. వాళ్ల మధ్య ఏం జరిగిందనేది మనం ఊహించలేం.. అది వాళ్ల ప్రైవసీకి సంబంధించిన విషయం.. ఏదేమైనా ఈ నిర్ణయం మాత్రం ఎమోషనల్ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.