హిందీ టెలివిజన్ పరిశ్రమలోని బోల్డ్ నటీమణులలో ఒకరు ఉర్ఫీ జావేద్ బిగ్‌బాస్‌తో పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రకరకాలుగా వేషధారణలతో వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తుంటుంది ఈ భామ. అయితే వాటిపై ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతూ ఉంటుంది. (Photo Credit : Instagram)
ఆ గుర్తింపును మరింత పెంచుకోవడానికి ఉర్ఫి నానా తంటాలు పడింది. ఆ మధ్యన ఓ లేడీ ప్రొడ్యూసర్ వెబ్ సిరీస్‌లో నటించాలని ఒప్పందం కుదుర్చుకుని తీరా లొకేషన్‌కు వెళ్లిన తర్వాత ఇబ్బంది పెట్టిందని, ఇబ్బందికర సన్నివేశాల్లో నటించలేనని చెప్పినప్పుడు ఆమె ఆగ్రిమెంట్స్ పేపర్స్ చూపించి జైలుకు పంపుతానని బెదిరించిందని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది. (Photo Credit : Instagram)
అయితే కొందరు మాత్రం ఉర్ఫీ మాత్రం పాపులారిటీ కోసమే అలా చేస్తుందని అంటుంటే, ఆమెను ఫాలో అవుతున్న కొందరు మాత్రం.. ఉర్ఫీ జావెద్ ఎంతో మంచి హృదయం కలదని డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు అని ఏమీ చూడదని అందరితో కలసిపోయే మనసత్త్వం గొప్పగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఏదిఏమైతేనేం ఉర్ఫీ మాత్రం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. (Photo Credit : Instagram)