ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో ఉపాసన కొణిదెల పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఉపాసన సద్గురుని అనేక ప్రశ్నలు అడిగింది. ఆశ్చర్య కరంగా తాను పిల్లలని కనడం గురించి కూడా సద్గురు వద్ద ఉపాసన ప్రశ్నించింది. ఉపాసన మాట్లాడుతూ.. నేను వివాహం చేసుకుని పదేళ్లు అవుతోంది. నా జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. నా ఫ్యామిలీని నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను.
పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను అవార్డు ఇస్తాను అని సద్గురు అన్నారు. అయితే దీనిపై ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. 'సద్గురు.. మీ అవార్డు తీసుకునేందుకు మా తాత అంగీకరించడం లేదు' అంటూ ఉపాసన ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది.ఇప్పుడు ఉపాసన పోస్టు వైరల్ అవుతున్నాయి.