Upasana Konidela : మెగా కోడలు ఉపాసన గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉపాసన, రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోంటూ సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. రీసెంట్గా రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో బేబి బంప్‌తో కనిపించింది. తాజాగా ఈమె పెళ్లైన కొత్తలో తాను అందంగా లేననే విమర్శలతో పాటు ఫ్యామిలీలో గొడవలపై స్పందించారు. Photo : Twitter
రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అశేష అభిమాన వర్గాన్ని ఆనందంతో ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో తొలిసారి తనకు పుట్టబోయే బిడ్డ గురించి ప్రస్తావిస్తూ అప్పట్లో ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా. Photo : Instagram
అంతేకాదు రామ్ చరణ్, ఉపాసన ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు తాము ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకటైన విషయాన్ని ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. .. Photo : Instagram
అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియిలో ఎంట్రీ ఇచ్చే వరకు వారికి సంబందించిన ఏ అప్డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిచింది.అంతేకాదు తాను నిర్వహిస్తోన్న పత్రికల కోసం సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వార్తల్లో నిలిచింది.
మా మధ్య బహుమతులకున్న ఒకరితో ఒకరు గడిపిన అపురూప క్షణాలంటేనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చింది. ఎంత ఖరీదైన గిఫ్ట్స్ కాదు. మన లైఫ్ పార్టనర్‌ను ఎంతో ఆనందంగా చూసుకున్నామనే విషయానికే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. చరణ్ నాకు భర్త అనే కాదు.. మంచి ఫ్రెండ్... ఫిలాసర్ అంటూ చెప్పుకొచ్చింది. నాకు విలువైన ఎన్నో మధుర క్షణాలను చరణ్ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. Photo : Instagram
భార్యా భర్తలన్నాకా.. విభేదాలు రావడం ఎంతో సహజం. కాపురంలో చిన్న చిన్న గొడవలే వివాహా బంధాన్ని మరింత రాటుతేలుస్తాయి. అలా మా మధ్య ఎన్నో చిలిపి తగాదాలొచ్చాయి. వాటిని మేమిద్దరం ఎంతో కలిసి కట్టుగా ఎదుర్కొన్నాం. మాదే కాదే.. అందరి కాపురాల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎంతో కామన్ అంటూ తమ వివాహా బంధంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు ఉపాసన.
పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఇక ఉపాపన ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటిస్తూ.. త్వరలో రామ్ చరణ్, ఉపాసన పేరెంట్స్ కాబోతున్నట్లు తన సోషల్ మీడియాలో తెలియజేశారు. Photo: Instagram
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. Photo : Twitter
భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో దర్శకుడు. నటుడు ఎస్ జే సూర్య నటించనున్నారట. దీనికి సంబంధించి టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ సినిమాలో చరణ్ సరసన హిందీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘గేమ్ ఛేంచర్’ టైటిల్‌తో వస్తోన్న ఈసినిమా ఈ యేడాది డిసెంబర్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. Photo : Twitter. Photo : Twitter
ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. Photo : Twitter. Photo : Twitter
సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter
మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.. వీటితో పాటు రామ్ చరణ్, కేజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాను, విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కూడా ఓ సినిమాను చేయనున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ఆగిపోయింది Photo : Twitter