ఈ సినిమాకు తెలుగు, మలయాళంలో మంచి వసూళ్లనే దక్కించుకుంది. కానీ నార్త్ రీజియన్‌లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయినా.. ఈ తరహా కథలతో అక్కడ పలు వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలు రావడంతో ఈ సినిమా అక్కడ అంతగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమాకు యూపీ సీఎం సహా ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్, సహా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
మేజర్ మూవీలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు శశి కిరణ్ తిక్క. మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది. ‘మేజర్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. సోనీ పిక్చర్స్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు.Photo twitter
ఈ సినిమా కోసం అడివి శేష్.. మేజర్ ఉన్నికృష్ణన్ పేరుతో ఫండ్ రైజింగ్‌కు తెర లేపిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా CDS & NDA లో చేరాలనుకునే అభ్యర్ధుల కోసం ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ని నుంచి ప్రత్యేకంగా ఈ ఫండ్ రైజింగ్ కోసం ఆయన్ని నుంచి ప్రామిస్ తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎంతో భేటితో అడివి శేష్‌తో పాటు దర్శకుడు శశి కిరణ్ తిక్కతో పాటు ఈ సినిమాలో కథానాయికగా నటించిన సాయి మంజ్రేకర్ తండ్రి మహేష్ మంజ్రేకర్ ఉన్నారు.(Twitter/Photo)
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 18 కోట్ల షేర్ (రూ. 30 కోట్ల గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 33కోట్ల షేర్ (రూ. 63 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి సాలిడ్‌గా దూసుకుపోతుంది. ఇక అడివి శేష్ కెరీర్లోనే తొలి రూ. 60 కోట్ల గ్రాస్ సినిమాగా మేజర్ సినిమా రికార్డులకు ఎక్కింది. (Photo twitter)
మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే.. బాక్సాఫీస్ దగ్గర రూ. 19 కోట్లు వసూళు చేయాలి. కానీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని .. రూ. 15 కోట్ల లాభాల్లోకి వచ్చింది. (Major Movie Photo : Twitter)
ఇక ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB మేజర్ మూవీకి 9.2 / 10 రేటింగ్ ఇచ్చింది. గతంలో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ మూవీకి 7.8/10 రేటింగ్ ఇచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. (Twitter/Photo)
మేజర్ మూవీ టీమ్ స్కూల్ పిల్లల కోసం ఈ సినిమాను సగం టికెట్ రేట్‌కే ప్రదర్శించనున్నారు. దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు. మొత్తంగా మేజర్ మూవీతో అడివి శేష్ టాక్ ది ఇండస్ట్రీగా మారారు. మొత్తంగా ఈ సినిమా టోటల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. Major Movie Photo : Twitter