Unstoppable with NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. రీసెంట్గా ఈ టాక్ షో దేశంలోనే ఈ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది.
ఇక అది అలా ఉంటే మహేష్ బాబు చేసిన ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం కానుందో తెలిపింది ఆహా.. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ప్రసారం కానున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ ఎపిసోడ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ విషయాన్ని ఆహా వాళ్లు అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ, మహేష్ బాబు ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)
రీసెంట్గా మహేష్ బాబు.. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ షోలో లాస్ట్ ఎపిసోడ్లో పాల్గొని ఆ షోకు శుభం కార్డు వేసారు. ఇక అబ్బాయి రియాలిటీ షోకు ఎండ్ కార్ట్ వేసిన మహేష్ బాబు.. తాజాగా బాబాయి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. (Twitter/Photo)
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ఆహా ఓటిటిలో వస్తున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వ్యాఖ్యాత అన్నపుడే ఈ షో సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన హోస్టింగ్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఆహా.. బాలయ్య ఏం చేస్తున్నాడ్రా బాబూ అంటూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బాలయ్య తనను తాను మార్చుకున్న తీరుకు సలామ్ కొడుతున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు.
తన స్టార్ డమ్ కూడా పక్కనబెట్టి వచ్చిన గెస్టులతో బాలయ్య వ్యవహరిస్తున్న తీరు అదిరిపోతుంది. తన కంటే ఇమేజ్‌లో ఎంతో చిన్నవాడైనా నానిని మొన్న బాలయ్య చూసుకున్న విధానం.. అతడిని పొగిడిన స్టైల్ చూసి పడిపోయారంతా. ఎపిసోడ్ ఎపిసోడ్‌కు బాలయ్య ఇంకా మెరుగవుతున్నాడు. పైగా గెస్టులు కూడా చాలా మంది వస్తున్నారు. ఇక రవితేజ ఎపిసోడ్లో కూడా మాస్ రాజాను బాగానే రిసీవ్ చేసుకున్నారు నట సింహాం.
టీడీపీ న్యూస్" width="1600" height="1600" /> ఇప్పటికే మోహన్ బాబు, బ్రహ్మానందం, నాని, అనిల్ రావిపూడి, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, థమన్, బోయపాటి శ్రీను వచ్చారు. ఆ తర్వాత ఎసిపోడ్‌లో కోడూరు బ్రదర్స్.. రాజమౌళి, కీరవాణి ఎపిసోడ్ ఓ రేంజ్లో అదిరిపోయింది. ఈ వారం అల్లు అర్జున్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత డిసెంబర్ 31 రవితేజ, గోపీచంద్ మలినేని ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. వీటి ఎపిసోడ్స్ షూట్స్ కూడా కంప్లీటయ్యాయి. మరోవైపు ఇప్పటికే మహేష్ బాబు ఎపిసోడ్ కూడా షూట్ చేసారు. మధ్యలో మూడు వారాలు గ్యాప్ ఇచ్చినా కూడా.. ఇకపై అలాంటి బ్రేకులు లేకుండా చూసుకుంటున్నారు ఆహా టీమ్.
ఓ వైపు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు వచ్చిన మహేష్ బాబు.. ఇప్పుడు బాబాయ్ బాలయ్య షోకు వచ్చాడు. ఈ ఎపిసోడ్లో మహేష్ బాబు తన కెరీర్‌కు సంబంధించిన ముచ్చట్లతో పాటు ఇంకా చాలా విషయాలు చర్చించాడని తెలుస్తుంది. మొత్తంగా మహేష్ బాబు .. ఆయా హీరోల రియాలిటీ షోలకు మంచి ఎండింగ్ ఇస్తున్నారు. (Twitter/Photo)
ఇక ఫస్ట్ సీజన్ ఎనిమిది ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. ఇక రెండో సీజన్ ఎపుడు మొదలవుతుందా అని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా బాలయ్య తన కెరీర్లో ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో పాటు ‘ఆహా’ టాక్ షోతో నిజంగా ప్రేక్షకులు ఆహా అనుకునేలా చేస్తున్నారు. (Twitter/Photo)