[caption id="attachment_1339668" align="alignnone" width="1200"] నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా హోస్ట్ అవతారం ఎత్తారు. అంతేకాదు ఓ హోస్ట్‌గా తనదైన శైలిలో అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టించారు. మోహన్ బాబు చిట్‌చాట్‌తో మొదలైన ఈ షో.. మహేష్ బాబుతో ఎండ్ అయింది. ఈ షో కారణంగా ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌కు భారీగా పెరిగారు. ఈ షోలో హోస్ట్‌గా బాలయ్య ఎలా రక్తించడానేది సెపరేట్‌గా చెప్పాాల్సిన పనిలేదు. (Twitter/Photo)
మొదటి సీజన్లో 10 ఎపిసోడ్లు ఉండగా 10 ఎపిసోడ్లు సూపర్ హిట్ గా నిలిచాయి. మొదటి సీజన్లో మోహన్ బాబు, సుకుమార్, అల్లు అర్జున్, మహేష్ బాబు రవితేజ, నాని వంటి సెలబ్రిటీలతో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. వావ్ అనిపించారు. ఇక ప్రస్తుతం సెకండ్ సీజన్ హవా నడుస్తోంది. ఈ సెకండ్ సీజన్లో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు. Photo : Twitter
బాలయ్య అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్లో ఫస్ట్ గెస్ట్‌గా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చారు. ఆ తర్వాత పలువురు రాజకీయ నేతలు, సినీ హీరోలు వచ్చారు. ఇటీవలే ప్రభాస్... ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య షోకు విచ్చేశారు. ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ ఈనెల 6న స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పుడు తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్య తో సరిసమానులైన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎందుకు ఈ షోకి రావడం లేదని అభిమానుల్లో ఒక సందేహం ఉండేది..ఆ సందేహాలకు అతి త్వరలోనే తెరపడబోతుందని సమాచారం.. మెగాస్టార్ చిరంజీవి 'అన్ స్టాపబుల్' షో లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా బయటకి రాబోతున్నట్టు సమాచారం..ముందుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలనుకుంది ఆహా టీం.. కానీ దానికంటే ముందు గా ఇలా ప్లాన్ చేస్తే ఇంకా క్రేజీ గా ఉంటుందని అటు చిరంజీవి , ఇటు బాలయ్య ఇద్దరు అనుకున్నారని సమాచారం. (Balakrishna Chiranjeevi)