Vijay Devarakonda Liger Team In Unstoppable with NBK: అన్ స్టాపబుల్ ఓటీటీ షో ద్వారా నందమూరి బాలకృష్ణ ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ప్రతి వారం ఈ షోలో ఎవరు గెస్ట్‌గా వస్తారా అని ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ శుక్రవారం సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ జనవరి 14 రాత్రి ఎనిమిది గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. విజయ్ దేవరకొండతో పాటు లైగర్ టీమ్ పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ షోలో సందడి చేస్తున్నారు. (Twitter/Photo)
ఇక ఈ షోలో బాలయ్య పంచె కట్టుతో హాజరయ్యారు. ముందుగా పైసా వసూలు సాంగ్‌తో ఇంట్రడక్షన్ ఇచ్చారు బాలయ్య. ఈ సందర్భంగా మాటల గన్.. జగన్.. జగ్గూ.. లేటైంది ఏంటి .. అంటూ బాలయ్య.. పూరీ సీటులో కూర్చుని పూరీలా మాట్లాడుతూ ఉంటే.. వెనకాల నుంచి పూరీ జగన్నాథ్ వచ్చి బాలయ్యకు హగ్ ఇచ్చారు. ఇక వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలోని తేడా సింగ్ పాత్ర గురించి చర్చించుకున్నారు. (Twitter/Photo)
నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నేనంటా.. ఇంకొకరు అంటే కొడతా అంటూ బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. ఏ ముహూర్తానా.. మామ ఏక్ పెగ్ లా పాట గురించి మాట్లాడుకుని నవ్వులు పూయించారు. ఇక ఛార్మిని చూసి అపుడు అల్లరి పిల్లలా ఉండేవాడివి. నువ్వు పిడుగులా తయారయ్యావు. ఈ సందర్భంగా బాలయ్య పూరీని లయన్ అని.. ఛార్మిని టైగర్ మీ ఇద్దరినీ కలిపితే.. ‘లైగర్’ అని చెప్పారు. దీంతో విజయ్ దేవరకొండ షోలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో బాలయ్య కొంచెం ఫన్నీగా బాక్సింగ్ చేసారు. ఈ సందర్భంగా బాలయ్య.. సమరసింహా రెడ్డి వెల్కమ్స్ అర్జున్ రెడ్డి అంటూ విజయ్ దేవరకొండను సాదరంగా ఆహ్వానించడంతో పాటు హగ్ కూడా చేసుకున్నారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా బాలయ్య.. విజయ్ దేవరకొండను ఉద్దేశించి నువ్వు రౌడీ అయితే.. నేను రౌడీ ఇన్స్పెక్టర్ని అంటూ చెప్పి జోష్ తీసుకొచ్చారు. నువ్వు రౌడీ అని ఎలా ఫిక్స్ అయ్యావు అని బాలయ్య ప్రశ్నించగా.. దానికి విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ.. ఇది చేయోద్దు.. అది చేయోద్దు .. అని చెబుతూ ఉండేవారు. అది వినకుండా లేదు బై నాకు తోచింది నేను చేసుకుంటూ వెళుతున్నా. అందుకే రౌడీ అనే పేరొచ్చింది. ఈ సందర్భంగా లైగర్ టీమ్ మెంబర్స్ అయిన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మిలకు స్వయంగా కొబ్బరిబొండాలను కొట్టి ఇచ్చారు బాలయ్య (Twitter/Photo)
ఈ టాక్ షో కోసం నందమూరి బాలకృష్ణ..తనను తాను మార్చుకున్న విధానం చూసి అందరు ఆశ్యర్యపోయేలా చేసారు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో డైలాగ్స్ లాగా.. చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడకు అంటూ.. నిజంగా తనలోని రెండో యాంగిల్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షోతో చేసి చూపించారు. లైగర్ టీమ్‌కు సంబంధించిన టాక్ షో సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానుంది. అన్‌స్టాపబుల్ షోలో ఇది 9వ ఎపిసోడ్. (Twitter/Photo)
బాలయ్యలోని ఈ కోణాన్ని ఆయన అభిమానులు కూడా చూసి ఉండరు. తాజాగా ఈ షో MDB (ఇండియన్ మూవీ డేటా బేస్)లో చోటు సంపాదించుకుంది. ఈ షో టాప్ 10 రియాలిటీ టీవీలో లిస్టులో చేరినట్టు ప్రకటించింది. IMDB 9.7/10 రేటింగ్‌తో దూసుకుపోతుంది. మొత్తంగా బాలయ్య ‘ఆహా’ ఓటీటీ వేదికతో నిజంగా హోస్ట్‌గా ప్రేక్షకులతో ఆహా అనిపిస్తున్నారు. (Twitter/Photo)
సంక్రాంతి కానుకగా జనవరి 14న విజయ్ దేవరకొండతో బాలయ్య టాక్ షో ప్రసారం కానుంది. ఈ షోలో లైగర్‌ను లయన్ ఎలాంటి ప్రశ్నలతో ఆట పట్టిస్తాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నాని, రానా, అల్లు అర్జున్‌లతో బాలయ్య చేసిన అల్లరి ఓ రేంజ్లో పేలింది. ఇపుడు లైగర్ విజయ్ దేవరకొండ.. బాలయ్య ఎలాంటి అల్లరి చేస్తాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సమర సింహా రెడ్డి వర్సెస్ అర్జున్ రెడ్డి ఎలా ఉండుటుందనేది ఆసక్తి నెలకొంది. (Twitter/Photo)
ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. (Balakrishna and Allu Arjun Photo : Twitter)
ఇఫ్పటికే ఈ షో హక్కులను కొనుగోలు చేసేందుకు పలు టీవీ చానెల్స్ సైతం ఆరాటపడుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య ఈ షో (Unstoppable with NBK) కోసం చేస్తున్న హోం వర్క్ అంతా ఇంతా కాదు. చాలా డెడికేషన్ తో కొత్త తరంతో కలిసి పనిచేస్తూ హిట్ కొట్టారు అనేది ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్న వాదన. మొత్తంగా ఈ షోతో ఆడియన్స్ కు తనపై ఉన్న థింకింగ్‌ను మార్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. (Twitter/Photo)
2021 బాలయ్య నామ సంవత్సరం అనే చెప్పాలి. ఆహా ఓటీటీతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈయన.. అఖండతో అఖండమైన విజయం అందుకున్నారు. ఈ రకంగా 2021 బాలయ్యకు ప్రత్యేకంగా నిలిచిందనడంలో అతిశయోక్తి కాదు. ఇప్పటకే 9 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ తాజాగా రవితేజ, గోపిచంద్ మలినేని ఇంటర్వ్యూతో మరో మజిలీ పూర్తి చేసుకుంది. అంతేకాదు అన్ స్టాపబుల్ కోసం బాలయ్య పూర్తి జోవియల్ గా మారిపోతున్నారు.
తన ప్రశ్నలతో అతిథులను ఆటపట్టించడమే కాదు. వాళ్లను ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్తున్నారు. అంతేకాదు ప్రతీ షోలోనూ ఒక హ్యూమన్ యాంగిల్ స్టోరీని ప్రసారం చేస్తున్నారు. ఇక తనపై వచ్చిన అపోహలు, గాసిప్స్ కు బాలయ్య ఈ వేదిక పై నుంచే క్లారిటీ ఇఛ్చేస్తున్నారు. తనకు రవితేజ మధ్య గొడవ అయ్యిందని దశాబ్దం క్రితం వెబ్ సైట్స్ కోడైకూశాయి. అలాంటి గాసిప్స్ కు బాలయ్య, ఏకంగా రవితేజతోనే క్లారిటీ ఇప్పించేసి అలాంటిదేమీ లేదని తేల్చేశారు.(Twitter/Photo)
బాలయ్య తాను చేసిన సినిమాల్లో ఫ్లాపులపైనే ఆయనే సెటైర్లు వేసుకోవడం, కూడా గమనించవచ్చు. ముఖ్యంగా రవితేజతో చేసిన ఇంటర్వ్యూ సందర్భంగా తాను నటించిన నిప్పురవ్వ సినిమాపై స్వయంగా సెటైర్ వేసుకోవడమే కాదు. ఆ సినిమాలో రవితేజ నటించకపోవడం అదృష్టం అంటూ చెప్పాడు. అలాగే సినిమా షూటింగ్ సమయంలోనే తనకు నిప్పురవ్వ చిత్రం రాడ్డు రంబోలా అవుతుందన్న సంగతి అర్థం అయ్యిందని చెప్పుకొచ్చారు. (Twitter/Photo)
మొత్తంగా అన్‌స్టాపబుల్ విత్ NBK లో సమర సింహారెడ్డి వర్సెస్ అర్జున్ రెడ్డి కాంబినేషన్ ప్రేక్షకులను ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి. మొత్తంగా లయన్ వర్సెస్ లైగర్ షో కోసం అభిమానులు ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ టాక్ షో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బాలయ్య పంచెకట్టుతో హాజరయ్యారు. (Twitter/Photo)