చూడు ఓవైపు చూడు.. అంటూ బాలయ్య సినిమాలో చెప్పినట్టు అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఈ షోలో ఎంతో ఈజ్‌తో చేసి హోస్ట్‌గా కెవ్వు కేక పుట్టించారు. ఇక అన్‌స్టాపబుల్ విజయ దశమి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ విజయవాడలో నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఏ సమయానికి అనే దానిపై ఆహా వాళ్లు క్లారిటీ ఇచ్చారు. (Twitter/Photo)
అన్‌స్టాపబుల్ సీజన్ 2 షోకు సంబంధించిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంధకార అభయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అంటూ ఈ ప్రోమోను కౌబాయ్ తరహా లెవల్లో తెరకెక్కించారు. ఇక అక్కడ ఎదురయ్యే సవాళ్లు అన్‌ప్రెడిక్టబుల్.. అయిన ఆగని మన పోరాటం.. అన్‌స్టాపబుల్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు ఓ రేంజ్లో ఉన్నాయి. (Twitter/Photo)
అన్‌స్టాపబుల్ సీజన్ 2లో ఫస్ట్ గెస్ట్‌గా బాలయ్య బావగారు కమ్ వియ్యంకుడైన చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ షోను ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ షోలో బాలయ్య తన ముద్దుల బావను ఎలాంటి ప్రశ్నలు వేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. (Twitter/Photo)
అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కాదు కాదు.. బ్లాక్ బస్టర్ హిట్టైయింది. బాలయ్య సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. స్మాల్ స్క్రీన్ పై కూడా తన హోస్ట్‌తో గర్జించారు. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. ఈ షో గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమైంది. ఫస్ట్ షోతోనే హోస్ట్‌గా తనదైన శైలిలో అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టించారు బాలయ్య. మోహన్ బాబు చిట్‌చాట్‌తో మొదలైన ఈ షో.. మహేష్ బాబుతో ఎండ్ అయింది. (Twitter/Photo)
ఈ షో కారణంగా ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌కు భారీగా పెరిగారు. ఈ షోలో హోస్ట్‌గా బాలయ్య ఎలా రక్తించడానేది సెపరేట్‌గా చెప్పాాల్సిన పనిలేదు. సీజన్ 2లో ఎవరెవరు గెస్ట్లుగా వస్తారు. వారితో ఎలాంటి చిట్‌చాట్ ఉంటుందనే విషయమై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అంచనాలను సీజన్ 2 అందుకుంటుందనే విశ్వాసంతో అభిమానులున్నారు. (Twitter/Photo)