మరోవైపు తాను 2003లో తనకు అలిపిరి ఘటన తర్వాత తాను ముందుస్తు ఎన్నికలకు వెళ్లాను. నన్ను చూసి కేంద్రంలో ఉన్న వాజ్‌పేయి, ఒడిస్సాలోని నవీన్ పట్నాయక్, ఎస్.ఎం.కృష్ణ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాము. అందులో నవీన్ పట్నాయక్ మాత్రమే గెలిచారు. మిగతా ముగ్గురుం ఓడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒకవేళ అపుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే.. పరిస్థితులు ఎలా ఉండేదే అని ఒకింత వైరాగ్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు (Twitter/Photo)
ప్రేమతో ఈ షోకు పిలిస్తే.. నన్ను ఓల్డ్ అంటారా.. నేను ఓల్డ్ కాదు గోల్డ్ అని బాలయ్య కవరింగ్ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మీకు తల ఎపుడో నెరిసిపోయింది. అంతేకాదు తెరపై అందంగా కనిపించడానికి జుట్లుకు రంగేసుకుంటూ ఏజ్‌ను కవర్ చేసుకుంటున్నారు. నేను అవేమి వేసుకొను. నేను వయసులో కాదు ఆలోచన విధానంలో యూత్ అని చెప్పుకొచ్చారు. (Twitter/Photo)