చూడు ఓవైపు చూడు.. అంటూ బాలయ్య సినిమాలో చెప్పినట్టు అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఈ షోలో ఎంతో ఈజ్‌తో చేసి హోస్ట్‌గా కెవ్వు కేక పుట్టించారు. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 స్టార్ట్ అయింది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. తాజాగా ఐదో ఎపిసోడ్ కోసం అన్‌స్టాపబుల్ క్రియేటర్ అల్లు అరవింద్‌తో పాటు సురేష్ బాబుతో పాటు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ముఖ్య అతిథులుగా ఈ షోలో సందడి చేయనున్నారు.
మొదటి ఎపిసోడ్లో చంద్రబాబు, లోకేష్ గెస్టులుగా వస్తే.. రెండో ఎపిసోడ్లో సిద్ద జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అలరించారు. మూడో ఎపిసోడ్లో అడివి శేష్, శర్వానంద్ గెస్ట్లుగా కేక పుట్టించారు. నాల్గో ఎపిసోడ్లో బాలయ్య స్నేహితులు ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డితో పాటు రాధిక సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా 5వ ఎపిసోడ్లో అల్లు అరవింద్‌తో పాటు సురేష్ బాబు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డిలు సందడి చేయనున్నారు. (Twitter/Photo)
బాలయ్యకు సురేష్ బాబుతో రాఘవేంద్రరావుతో పాటు కోదండరామిరెడ్డిలతో పనిచేసిన అనుభవం ఉంది. ఇపుడు అల్లు అరవింద్‌తో అన్‌స్టాపబుల్ అంతూ తన ప్రయాణం మొదలు పెట్టారు. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య అల్లు అరవింద్, సురేష్ బాబులను సినిమాల నిర్మాణం,థియేటర్స్, ఓటీటీ వేదికల గురించి చర్చించే అవకాశాలున్నాయి. ఈ షోలోనే బాలయ్యతో అల్లు అరవింద్ సినిమా ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
మరి ముఖ్యంగా అల్లు అరవింద్.. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వైపు అడుగులు వేయడానికి కారణాలు.. చిరంజీవితో అనుబంధం వంటివి ఈ షోలో బాలయ్య అడిగే అవకాశాలున్నాయి. ఇక సురేష్ బాబుతో కూడా సినీ, రాజకీయాలను చర్చించే అవకాశాలున్నాయి. ఇక సురేష్ బాబు నాన్న డి.రామానాయుడు బాలయ్యతో పాటు ఎన్టీఆర్‌తో తీసిన సినిమాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
ఈ షోలో అల్లు అరవింద్, సురేష్ బాబు మెయిన్ గెస్టులు కాగా. రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డిలు షో మధ్యలో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావుకు ఎన్టీఆర్‌తో అనుబంధం.. తనతో తెరకెక్కించిన సినిమాల విషయమై చర్చించే అవకాశాలున్నాయి. వీళ్ల కాంబినేషన్లో 7 సినిమాల్లో 2 మాత్రమే సక్సెస్ సాధించాయి. 1 యావరేజ్‌గా నిలిచింది. మిగిలిన 4 ఫ్లాప్‌గా నిలిచాయి. (Twitter/Photo)
నందమూరి బాలకృష్ణ.. తన సుధీర్ఘ కెరీర్లో కోదండరామిరెడ్డితోనే ఎక్కు చిత్రాలు చేసారు. దాదాపు వీళ్ల కాంబినేషన్లో 13 చిత్రాలు తెరకెక్కాయి. అనసూయమ్మ గారి అల్లుడుతో మొదలైన వీళ్ల కాంబినేషన్.. యువరత్న రాణా వరకు కొనసాగింది. అందులో ఎక్కువగా హిట్ సినిమాలున్నాయి. ఈ అపూర్వ కలయికలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలతో పాటు చిరంజీవి ఇతర హీరోలతో తెరకెక్కించి సినిమాల గురించి చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
ఏది ఏమైనా.. అన్‌స్టాపబుల్ 2 షోలో ఈ ఎపిసోడ్ మాత్రం హైలెట్‌గా నిలిచే అవకాశాలున్నాయి. నలుగురు తెర వెనక లెెజెండ్స్తో తెర ముందు లెజెండ్‌లో ముచ్చట్టు ఎలా ఉండబోతున్నాయో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు యూత్‌తో పాటు 80,90ల ప్రేక్షకులు ఈ ఎపిసోడ్‌ను చూసే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటు రాజకీయాలతో పాటు.. అటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా మారారు. అయితే ఈ క్రమంలో బాలయ్య ఓటీటీలోకి వచ్చి అందర్నీ షాక్ ఇచ్చారు. బాలయ్య చేస్తున్న ప్రముఖ ఓటీటీ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఏది ఏమైనా బాలయ్యలో ఎవరు గుర్తించని ఈ యాంగిల్‌ను అల్లు అరవింద్ గుర్తించడం విశేషం. అంతేకాదు దాన్ని సరైన రీతిలో ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అవ్వడంలో అల్లు అరవింద్ పాత్రను మరవలేమనే చెప్పాలి. (Twitter/Photo)
అన్‌స్టాపబుల్ సీజన్ 1లో అంతా సినిమా తారలే వస్తే.. సెకండ్ సీజన్లో మాత్రం కాస్త వెరైటీగా సినీ నటులతో పాటు రాజకీయ నేతలను కూడా ఈ షోకు గెస్ట్లుగా పిలుస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీని శాసిస్తోన్న నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబులతో పాటు.. లెజండరీ దర్శకులు కే.రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డిలు సందడి చేయనున్నారు. మరి ఎషిపోడ్ ఎలా ఉండబోతుందో బాలయ్య.. వీళ్ల మధ్య ఇంట్రాక్షన్ ఎలా ఉండబోతుందనేది తెలియాంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 2న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. (Twitter/Photo)