బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ 2022 అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు, లోకేష్ వచ్చి అదరగొట్టారు. రెండో ఎపిసోడ్‌కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్‌కు శర్వానంద్, అడివిశేష్ వచ్చి అలరించారు. Photo : Twitter
నాల్గవ ఎపిసోడ్‌కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ KR సురేష్ రెడ్డి వచ్చారు. ఐదో ఎపిసోడ్‌కు అల్లు అరవింద్, కోదండ రామిరెడ్డి, రాఘవేంద్రరావులు వచ్చారు. ఇక ఆరో ఎపిసోడ్‌కు ప్రభాస్, గోపీచంద్ వస్తున్నారు. ఈ బాలయ్య, ప్రభాస్‌ల ఎపిసోడ్ రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే మొదటి పార్ట్ డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్కు వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అందరూ స్ట్రీమ్ చేయడంతో వచ్చిన అరగంటలోపే సర్వర్ క్రాష్ అయ్యింది. దీంతో ఆహా యాప్ కొన్ని గంటల వరకు పనిచేయలేదు. Photo : Twitter
ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ తర్వాత పవన్, త్రివిక్రమ్‌తో పాటు ప్రసారం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ పూర్తి అయ్యిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌తో పాటు మరో దర్శకుడు క్రిష్ కూడా పాల్గోన్నారని తెలుస్తోంది. ఇక పవన్ , బాలయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందని.. పవన్ పర్సనల్ విషయాలపై కూడా బాలయ్య ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. దీంతో ఈ ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని అంటున్నారు నెటిజన్స్. Photo : Twitter
ఇక లేటెస్ట్గా శుక్రవారం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ రిలీజైంది. ఈ టీజర్లో పెద్దగా ఏమీ చూపించలేదు. అయితే చాలా కాలం తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనుండడంతో ఈ ఎపిసోడ్ కోసం అభిమానులకు ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారు. హోస్ట్‌గా బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు? దానికి పవన్ కళ్యాణ్ ఎలాంటీ సమాధానాలు చెప్పారనే అంశంపై ఆసక్తిగా ఉన్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. బాల అని పిలమని పవన్ కళ్యాణ్‌ని బాలకృష్ణ కోరగా.. ఓడిపోవడానికి సిద్ధం కానీ అలా పిలవలేను అని అనేశారు. దానికి బాలయ్య ఈ పాలిటిక్స్ వద్దూ అంటూ పంచ్ వేశారు.
బాలయ్య మరో ప్రశ్న అడుగుతూ.. మీ అన్నయ్య చిరంజీవి నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటీ, వద్దనుకుంది ఏంటనీ అడిగారు బాలయ్య.. ఇక మరో ప్రశ్న అడుగుతూ.. రాష్ట్రం మొత్తం నీ ఫ్యాన్సే ఎందుకు ఓట్లు పడలేదు అని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు పవన్ సమాధానాన్ని మాత్రం టీజర్లో చూపించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ షోకు తెలంగాణ మినిష్టర్ కేటీఆర్, రామ్ చరణ్ కలిసి వస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండనుందో.. Photo : Twitter
బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేశారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 12న భారీగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. టీజర్స్ అండ్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో వచ్చాయి. Photo : Twitter
వీరసింహారెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. నిన్నటి ఈ సినిమా 8 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. అఖండ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన రెండో బాలయ్య చిత్రంగా వీరసింహారెడ్డి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు బాలయ్య కెరీర్లో వీరసింహారెడ్డి ఓ అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. Photo : Twitter
బాలయ్య గత సినిమా “అఖండ” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ చిత్రం అందుకున్న టోటల్ వసూళ్ళని వీరసింహా రెడ్డి కేవలం ఈ 8 రోజుల్లోనే కలెక్ట్ చేసి అదరహో అనిపించింది. దీనితో వీరసింహా రెడ్డి బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వీర సింహారెడ్డి విడుదలైన 3 రోజుల్లోనే USAలో బ్రేక్ఈవెన్ మార్క్‌ను చేరుకుంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల షేర్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో నాలుగు కోట్ల షేర్ రావాల్సి ఉంది. Photo : Twitter
అఖండ సినిమా మొదటి వారం రూ. 53.49 కోట్ల షేర్ (రూ. 87.9 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధిస్తే.. వీరసింహారెడ్డి మూవీ 1 వారంలోనే రూ. 68.51 కోట్ల షేర్ (రూ. 114.95 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మంచి అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే దూకుడుతో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తోంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూస్ డాలర్స్‌ను కలెక్ట్ చేసి 1.5 మిలియన్ క్లబ్బు వైపు పరుగులు తీస్తోంది. (Photo : Twitter
ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. వీరసింహారెడ్డికి తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.35 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 31.05 కోట్ల షేర్ (రూ. 50.10 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు రూ. 6.15 కోట్లు.,., (రూ. 11.05 కోట్ల గ్రాస్).. మూడో రోజు.. రూ. 7.30 కోట్లు.. (రూ. 12.75 కోట్లు గ్రాస్).. నాల్గో రోజు.. రూ. 8.15 కోట్లు.. (రూ. 14.20 కోట్ల గ్రాస్).. ఐదో రోజు .. రూ. 7.25 కోట్ల షేర్.. రూ. (రూ. 12.50 కోట్ల గ్రాస్).. ఆరో రోజు.. రూ. 5.20 కోట్లు..(రూ. 8.75 కోట్ల గ్రాస్), ఏడో రోజు ఈ సినిమా రూ. 3.21 కోట్ల షేర్ (రూ. 5.20 కోట్ల గ్రాస్), ఎనిమిదో రోజు.. రూ. 1.63 కోట్లు షేర్ (రూ. 2.65 కోట్లు గ్రాస్) వసూళ్లను సాధించింది. (Photo : Twitter)
ఈ సినిమా 8 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే. తెలంగాణ (నైజాం)లోరూ. 15.82కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 15.38 కోట్లు . ఉత్తరాంధ్ర.. రూ. 6.78 కోట్లు .. తూర్పు గోదావరి.. రూ. 5.14 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 3.88 కోట్లు .. గుంటూరు..రూ. 6.04 కోట్లు .. కృష్ణ.. రూ. 4.33 కోట్లు నెల్లూరు .. రూ. 2.67 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి ఆరు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 60.04 కోట్లు / రూ. 97.10 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్.. రూ. 4.55 కోట్లు ఓవర్సీస్.. రూ. 5.55 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 8వ రోజు కలిపి రూ. రూ. 70.14కోట్లు షేర్ / రూ. 117.60 కోట్లు గ్రాస్) ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 3.86 కోట్ల షేర్ రాబట్టాలి. (Twitter/Photo)
మొత్తంగా అన్ని ఏరియాల్లో 90 శాతం రికవరీ అయింది. తెలంగాణ (నైజాం)లో రూ. 15 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 13 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 9 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 5.2 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 5 కోట్లు.. గుంటూరు.. రూ. 6.40 కోట్లు.. కృష్ణ.. రూ. 5 కోట్లు.. నెల్లూరు .. రూ. 2.7 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 61.30 కోట్లు.. కర్ణాటక .. రూ. 4.50 కోట్లు.. రెస్టాఫ్ భారత్ .. రూ. 1 కోటి.. ఓవర్సీస్.. రూ. 6.2 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 74 కోట్ల షేర్ .. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది ( (Twitter/Photo)
వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య .. వీరసింహారెడ్డిగా.. జైసింహారెడ్డిగా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన 17వ చిత్రం. ఈయన చెల్లెలు కమ్ మేనత్త పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. (Twitter/Photo)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. ఈ డైలాగులకు థియేటర్స్‌లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
ఇక అది అలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపుగా రూ. 14కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి విడుదలైన ఎనిమిది వారాలకు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. Photo : Twitter
ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హానీ రోజ్ నటించారు. కామెడీ పాళ్లు లేకపోవడం.. సీరియస్‌గా సాగే కథనం ఈ సినిమాకు ఇబ్బంది పెట్టే అంశాలు. ముక్యంగా వీరసింహారెడ్డిలోని కంటెంట్ ఎక్కువగా మాస్కు అప్పీల్ అవ్వుతుండడంతో బి,సి సెంటర్స్‌లో వీరసింహారెడ్డి అదరగొడుతోంది. Photo : Twitter
ఇప్పటికే సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. మొత్తంగా ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే 90 శాతం టార్గెట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ముందు ముందు వీరసింహా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందో చూడాలి. (Twitter/Photo)
వీర సింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్ని పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో యువ హీరోయిన్ ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల డాటర్‌గా కనిపించనుంది. Photo : Twitter
ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాకు“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలిపారు బాలయ్య. ఆయన ఆహాలో వస్తున్న తన టాక్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో.. అంటూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. Photo : Twitter
ఇక బాలయ్య- అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండేవిధంగా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ బిందు మాధవి కూడా ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ఈ సినిమా గ్రాండ్ ఫినాలేలో అనిల్ రావిపూడి చెప్పారు. మరి బిందు మాధవికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా ? లేకపోతే వేరే ఏదైనా పాత్ర ఇస్తాడనేది చూడాలి. మొత్తంగా ప్రేక్షకులు మరిచిపోయిన బిందు మాధవికి అనిల్ రావిపూడి.. అది కూడా బాలయ్య సినిమాలో అవకాశం అంటే మాములు విషయం కాదు. మరి ఈ సినిమాతో బిగ్‌బాస్ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. Photo : Twitter