Home » photogallery » movies »

UNSTOPPABLE WITH NBK BALAKRISHAN NANDAMURI TALK SHOW INDIAS NUMBER ONE TALK SHOW HERE ARE THE DETAILS TA

Unstoppable with NBK : బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో మరో రికార్డు.. మన దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో..

ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. తాజాగా ఈ షో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.