ఈ ప్రోమో వీడియోలో కాస్త సెంటిమెంటల్ టచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ‘డీజే టిల్లు’ హీరో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన సినిమా కష్టాలు విని బాలయ్య తెగ ఫీల్ అయ్యారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను హీరోగా చేద్దాం అన్నా అని ఓ వ్యక్తి దగ్గరకు వెళ్తే.. ఏంటి ఈ ముఖంతోనే హీరో అయిపోదాం అనుకుంటున్నావా? అని అవమానించారని సిద్దు చెప్పగానే బాలయ్య కళ్ళు చెమ్మగిల్లాయి.
సిద్దు.. నీ కష్టాలు వింటుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయని బాలయ్య చెప్పడం ఈ వీడియోలో చూపించారు. అదేవిధంగా మరో హీరో విశ్వక్ సేన్ కష్టాలను కూడా చూపించి ఈ ఎపిసోడ్ కాస్త ప్రత్యేకమైనదే అనే హింట్ అయితే ఇచ్చారు. సో.. బాలకృష్ణతో ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఎలాంటి సీక్రెట్స్ చెప్పారనేది క్లారిటీగా తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే.