పవన్ కళ్యాణ్ , పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, అన్‌స్టాపబుల్" width="1600" height="1600" /> ఫస్ట్ ఎపిసోడ్లో పవన్ కళ్యాన్ మూడు మ్యారేజ్లపై క్వశ్చన్స్ అడిగి బాలయ్య ఆసక్తిరేసారు. అంతేకాదు ఇకపై పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై మాట్లాడేవారు ఊర కుక్కలు అంటూ ఒక తీర్మానం చేశారు బాలయ్య. ఇక బాలకృష్ణ, పవన్ ఎపిసోడ్లో చిన్నపుడు తాను బాలయ్య నటించిన ‘సీతారామకళ్యాణం’, ఆదిత్య 369 సినిమాలు చూసినట్టు చెప్పారు. తొలిసారి తాము పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సుస్వాగతం’ సినిమా ఓపెనింగ్‌లో కలిసినట్టు చెప్పుకొచ్చారు.
నందమూరి నట సింహా బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. టాలీవుడ్లో నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేస్తోన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక వేదికపై కనిపించడంపై ఇరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆహా వేదికగా బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అన్ స్టాపబుల్ షో టాప్ రేంజ్ కు వెళ్లింది. ఈ షోలో సాయి ధరమ్ తేజ్ పంచ కట్టులో హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈ షోలో పవన్ కళ్యాణ్‌తో హరిహరవీరమల్లు సినిమాను తెరకెక్కిస్తోన్న క్రిష్ పాల్గొన్నారు. ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ ఎపిసోడ్ మధ్యలో వీడియో కాల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లతో ముచ్చటించింది. అంతేకాదు హరిహరవీరమల్లులో పవన్‌తో నటించడంతో పాటు చిత్ర విశేషాలను పంచుకున్నారు నిధి అగర్వాాల్.(Twitter/Photo)
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు నీ ఫ్యానే .. అలాంటి నీవు ఎన్నికల్లో ఎలా ఓడిపోయావు భయ్యా అంటూ బాలయ్య అడగడం హైలెట్‌గా నిలిచింది. ఇంకోవైపు బాలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీ ఫ్యాన్ కానీవాడు లేడు. మీ మ్యానిఫెస్టోను పూర్తిగా ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడం వల్ల అవి ఓట్లుగా కన్వర్ట్గా కాలేదని బాలయ్య అడిగారు. ముఖ్యంగా రాజకీయంగా, వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసేవాళ్లకు ఈ షో వేదికగా పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. (Twitter/Photo)
ఇక ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినపుడు యువ రాజ్యం అధినేతగా పవన్ కల్యాణ్ అప్పటి నేతలను పంచ లూడదూసి కొడతారన్న చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ ఇష్యూపై బాలయ్య క్వశ్చన్ అడిగినట్టు సమాచారం. ఈ షోలో బాలయ్యను పవన్ కళ్యాణ్.. బాలయ్య గారు అని సంభోదించినట్టు సమాచారం. మరోవైపు బాలయ్య.. పవన్‌ను భయ్యా అంటూ పిలవడం ఈ షోలో హైలెట్ అని చెప్పొచ్చు. తొలిసారి వీళ్లిద్దరు సుస్వాగతం సినిమా ప్రారంభోత్సవంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నేను యంగ్‌గా ఉన్నానంటూ బాలయ్య అనడం.. ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తున్నావు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం ఇరు హీరోల అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. (File/Photo)
ఇంకోవైపు ఈ షోలో చిరంజీవి నుంచి ఏమి నేర్చుకున్నావు. ఏమి నేర్చుకోకూడదనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలకు సంబంధించిన విషయాలనే ఎక్కువగా ప్రస్తావించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీ ను ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేసినట్టు ఈ షోలో బాలయ్య ఆసక్తికర ప్రశ్నలు అడినట్టు సమాచారం. (File/Photo)
నేత కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో జనసేనాని పాల్గొనడం సినీ, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ, కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.సెకండ్ సీజన్లో ఇది లాస్ట్ ఎపిసోడ్.. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో భాగం మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. (File/Photo)