బాలయ్య, పవన్ కలిస్తే అంతే మరి.. పవన్ కళ్యాణ్‌తో బాలయ్య రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు. తాజాగా అన్‌స్టాపబుల్ గ్రాండ్ పవర్ ఫినాలే సెకండ్ ఎపిసోడ్లో అభిమానులకు బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇద్దరు కిక్ ఎక్కించారు. అంతకు మించి కిక్కించే అప్డేట్ ఇచ్చారు. (Twitter/Photo)
అన్‌స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ పై బాలయ్య ప్రేక్షకులను ప్రశ్న అడగగా అందరు బాలకృష్ణ, పవన్ మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుంటుందని చెప్పారు. బాలయ్య ముందుగా పవన్ తో మల్టీస్టారర్‌కు సంసిద్ధత వ్యక్తం చేయగా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా బాలయ్యతో మల్టీస్టారర్ మూవీకి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. (Twitter/Photo)
మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతాం కానీ.. ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం. రాజకీయాల్లో ఆధిపత్య ధోరణితో ఇదంత జరగుతోందనే విషయాన్ని పవన్ కళ్యాణ్.. బాలయ్యతో ప్రస్తావించారు. ఇంకోవైపు బాలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీ ఫ్యాన్ కానీవాడు లేడు. మీ మ్యానిఫెస్టోను పూర్తిగా ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడం వల్ల అవి ఓట్లుగా కన్వర్ట్గా కాలేదని బాలయ్య అడిగడం హైలెట్‌గా నిలిచింది. (Pawan Kalyan, Balakrishna)
మొత్తంగా అల్లు అరవింద్‌తో ఎపిసోడ్లో చిరంజీవితో మల్టీస్టారర్‌కు సై అన్న బాలయ్య.. తాజాగా పవన్‌తో గ్రాండ్ ఫినాలేలో పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ చేస్తానని చెప్పడం ఇటు నందమూరి అభిమానులతో పాటు అటు మెగా అభిమానుల్లో జోష్ నింపిందనే చెప్పాలి. మరి ఈ టాక్ షోలో చెప్పినట్టు చిరు,పవన్ కళ్యాణ్‌లతో బాలయ్య మల్లీస్టారర్ కార్యరూపం దాలిస్తే చూడాలనుకునే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. (Twitter/Photo)