పెళ్లైంటే నూరేళ్ల పంట అని ఓ కవి అన్నారు. మన దగ్గర చాలా మంది వివాహాన్ని ఓ డెస్టినేషన్‌గా ఎంచుకుంటారు. పెళ్లి అయితే అంతా సెటిలైనట్టే అని భావిస్తారు. పెళ్లిపై ఒక్కొక్కరికి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. మన కొందరు హీరోయిన్లు 20 ఏళ్లలోనే చేసుకున్నారు. మరి కొందరు పెళ్లి చేసుకుని మరీ కెరీర్‌ను కంటిన్యూ చేసిన వాళ్లు ఉన్నారు. మరికొందరు 50 దాటినా చేసుకోలేదు. హీరోలలో సల్మాన్ ఖాన్.. హీరోయిన్లలో టబు లాంటి వాళ్లు 50 దాటినా కూడా పెళ్లికి దూరంగానే ఉన్నారు. వీళ్లే కాక ఇంకెవరున్నారంటే.. (File/Photo)
సితార:
సీనియర్ హీరోయిన్ సితార కూడా పెళ్లికి దూరంగానే ఉండిపోయింది. ఈమెకు కూడా ఓ తమిళ హీరోతో ఉన్న ప్రేమ కారణంగానే పెళ్లికి దూరంగా ఉంది. ఓ హీరోను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి.. ఆయన మరణించడంతో పెళ్లికి దూరంగానే ఉండిపోయింది సితార. తన తండ్రికి చాలా క్లోజ్ అని.. తల్లిదండ్రులను వదిలి వెళ్లడం ఇష్టం లేక పెళ్లి చేసుకోలేదు అని చెప్తుంటారు కూడా. తన తండ్రి చనిపోయిన తర్వాత పెళ్లి ఆలోచన పూర్తిగా పోయిందన్నారు సితార.
వెన్నిరాడై (వెన్నిర ఆడై) నిర్మల:
తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించిన నిర్మల అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున రగడ, వెంకటేష్ కలిసుందాం రా, మోహన్ బాబు అధిపతి, బాలయ్య సీమ సింహం లాంటి సినిమాల్లో ఆయా హీరోలకు తల్లి పాత్రలు చేసింది ఈమె. నిర్మల కూడా పెళ్లికి దూరంగానే ఉంది.
నర్గీస్ ఫక్రీ:
పాకిస్థాన్ నుంచి వచ్చిన నర్గీస్ ఫక్రీ మన భారత దేశంలోనే బాగానే ఫేమస్. ముఖ్యంగా 2011లో వచ్చిన రణ్‌బీర్ కపూర్ రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత కూడా ఎక్కువగా హిందీలోనే నటించింది నర్గీస్ ఫక్రీ. ఓ బాలీవుడ్ నిర్మాతతో ప్రేమలో ఉన్న నర్గీస్.. పెళ్లి మాత్రం చేసుకోలేదు.
సుష్మితా సేన్:
ఈమె పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌తో పాటు తమిళం, తెలుగులోనూ సినిమాలు చేసిన సుష్మితా సేన్.. 40 దాటినా కూడా పెళ్లి చేసుకోలేదు. ఈమె కొన్నేళ్లుగా రొమన్ షాల్‌తో ప్రేమలో ఉంది.. ఈ మధ్యే విడిపోయింది కూడా. ఇపుడు లలిత్ మోదీతో ప్రేమాయణం సాగిస్తోంది. మరి ప్రేమాయణం పెళ్లి వరకు వెళుతుందా అనేది చూడాలి.
నగ్మా:
అప్పట్లో దాదాపు అందరు హీరోలతో నటించి టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నగ్మా.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయిపోయింది. నగ్మా కూడా తన పెళ్లి గురించి ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. గంగూలీ తో ప్రేమాయణమే ఈమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అంటారు కొందరు.ఆ తర్వాత శరత్ కుమార్ సహా పలువురు హీరోలతో ఈమె డేటింగ్ యవ్వారం నడిపింది.
శోభన:
సీనియర్ నటి శోభన సైతం 50 దాటిన తర్వాత పెళ్లి చేసుకోలేదు. 2017లో శోభన పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ 2018లో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడనని.. కానీ తను సింగిల్‌గా సంతోషంగా ఉన్నాను అని తెలిపింది. ఓ స్టార్ హీరోతో ప్రేమ విఫలం కావడమే శోభన పెళ్లికి దూరంగా ఉండటానికి కారణమని చెప్తుంటారు.
కాంచన : ఒకప్పుడు టాలీవుడ్‌తో కోలీవుడ్‌లో అందాల తారగా పేరు గడించిన కాంచన.. కూడా పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గా ఉండిపోయింది. అప్పట్లో ఈమెను పెంచిన తల్లిదండ్రులు ఈమెను ఆస్తి కోసం మోసం చేసినట్టు చెప్పుకొచ్చారు. నమ్మిన వాళ్ల చేతిలో మోస పోవడంతో కాంచనకు జీవితంపై విరక్తి పుట్టింది. అందుకే పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గా ఉండిపోయింది. చివరగా ఈమె విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’లో హీరుో నాయనమ్మ పాత్రలో నటించింది. (File/Photo)