మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. సాయి తేజ్ రెండు నెలల క్రితం దుర్గం చెరువు రోడ్డు యాక్సిడెంట్‌కి గురైన సంగతి తెలిసిందే. సాయితేజ్‌కు సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో పక్కటెముకలు విరగడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. సాయితేజ్ సుమారు 40 రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యిన సంగతి తెలిసిందే. Photo : Twitter
సాయి తేజ్ ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక యాక్సిడెంట్ నుంచి కోలుకున్న సాయితేజ్‌ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. ఇదే విషయాన్ని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. Photo : Twitter
ఆయన ఈ సందర్భంగా రాస్తూ.. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంటికొచ్చి కలిసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు దీనికి సంబంధించిన పిక్స్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సాయితేజ్ (Sai Dharam Tej) సినిమాల విషయానికి వస్తే.., ఆయన తాజాగా దేవ కట్టా (Deva Katta) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్లో నటించారు. Photo : Twitter
ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. దీనికి తోడు వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న (Republic) 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. Photo : Twitter
సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించారు దేవా కట్టా. ఇక థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా జీ5లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. Photo : Twitter
సినిమా కంటెంట్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ ఆడియన్స్ అంచనాలు వేరేగా ఉండటంతో సినిమా బిజినెస్‌ను అందుకోలేక లాస్‌ను సొంతం చేసుకుంది. రిపబ్లిక్ సినిమా (Republic world wide collections) మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇక ఈ సినిమాను 12 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్‌గా థియేటర్ రన్ పూర్తి చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర 5.64 కోట్ల లాస్‌ను సొంతం చేసుకుని.. సినిమా డిసాస్టర్‌గా నిలిచింది. Photo : Twitter