అయితే దేశ ప్రధాని పాత్రలో నటిస్తున్న రవీనా టాండన్ తన సైన్యంతో రాఖీ భాయ్‌ను కూడా చంపించేస్తుందని తెలుస్తుంది. అలా క్లైమాక్స్ విషాదాంతమే అవుతుందని.. అమ్మ మాట ప్రకారం చచ్చిపోయేటప్పుడు ధనవంతుడిగానే రాఖీ చచ్చిపోతాడని.. అలా కెజియఫ్ కథ అంతమైపోతుందని ప్రచారం జరుగుతుంది. విషాదాంతం అయినా కూడా ఎమోషనల్‌గా కథను ముగించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.