ఈ ఇద్దరి ప్రేమ విషయాన్ని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బయట పెట్టారు. తన లేటెస్ట్ సినిమా ‘తోడేలు’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు, దీపికా పడుకోణెతో షూటింగ్లో ఉన్నాడంటూ బాంబ్ పేల్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తున్న కృతి సనన్.. ప్రస్తుతం భేడియా (తెలుగులో తోడేలు)తో హిట్ కొట్టేసింది. దీంతో వరుణ్ ధావన్, కృతిల ఖాతాలో హిట్ పడింది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పదే పదే ప్రభాస్ పేరు ప్రస్థావనలోకి రావడం విశేషం. ఓ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ తో పెళ్లి అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చింది కృతి.
ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా చేస్తోంది కృతిసనన్. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్స్, ఇతర పనుల్లో ప్రభాస్ తో ఫుల్ క్లోజ్ అయింది కృతి. ఈ ఇద్దరూ కూడా ఎంతో సరదాగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఆదిపురుష్ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ తో పెళ్లిపై కృతి ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.