‘కాంతార’ సినిమాను కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) హోంబలే ఫిలింస్ లో నిర్మించారు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబడుతోంది
కాంతార’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. మరోవైపు కాంతార సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కు భారీ ఆఫర్ వచ్చింది. తెలుగులో కాంతార మరో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో కాంతార సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల్ని కొనుగోలు చేసినందుకు ప్రముఖ ఛానల్స్ భారీగానే పోటీ పడ్డాయి. ఫైనల్’గా స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకుంది. మొత్తం 4.5 కోట్ల రూపాయలకు స్టార్ మా కాంతార శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది.
‘కాంతార’ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘వరాహ రూపం’ (Varaha Roopam) పాటను థియేటర్లలో ప్రదర్శించరాదంటూ కేరళ కోర్టు (Kerala Court) గతంలో తీర్పునిచ్చింది. తైక్కుడం బ్రిడ్జ్ (Thaikkudam Bridge) మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా ఆ పాటను థియేటర్లలో ప్రదర్శించకూడదని కొజికొడె జిల్లా సెషన్స్ జడ్జ్ తీర్పునిచ్చారు.