Navya swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. చక్కని అందం, ఆకట్టుకునే నటనతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించింది. ఇక బుల్లితెరలో పలు షోలలో పాల్గొని బాగా సందడి చేస్తుంది. తనతో పాటు ఆమె కథ సీరియల్ లో నటించిన రవికృష్ణతో బాగా సన్నిహితంగా ఉంటుంది. నిత్యం ఫొటో షూట్ లతో బాగా బిజీగా ఉంటూ వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఇక ఇప్పుడు నవ్య స్వామి తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయ్. ఆ ఫోటోలలో నవ్య స్వామి వంకాయ రంగు లంగఓణి ధరించి ఉండగా నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటుంది. మరీ మీరు ఆ ఫోటోలు ఏవో చూసేయండి.