సుమ | తెలుగు ఇండస్ట్రీలో నెం 1 యాంకర్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ఎవరైనా చెప్పే మాట సుమ కనకాల. ఈమె ఇప్పటికీ ప్రతీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుకలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్షన్‌కు దాదాపు రూ. 2 నుంచి రూ. 2.5 లక్షల వరకు సుమ వసూలు చేస్తుందనిది టాక్. ఇది కేవలం ఆడియో వేడుకలకు మాత్రమే.. అవార్డు ఫంక్షన్ అయితే రేట్ మరోలా ఉంటుందట. (Twitter/Photo)
అనసూయ | ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ సంపాదలో రెండో ప్లేస్‌లో ఉంది.గ్లామర్ షోతో మతులు పోగొట్టే రంగమ్మత్త అంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన క్రేజ్. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. 2 లక్షలు ఛార్జ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య ఈవెంట్స్ చేయడం మానేసిన అనసూయ.. టీవీ షోలతోనే బిజీగా ఉంది. దానికి తోడు సినిమాలు కూడా చేస్తుంది. త్వరలో ‘ఆచార్య’తో పాటు ‘పుష్ప’ సినిమాల్లో నటిస్తోంది. (Twitter/Photo)
వంటలక్క ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్ | కార్తీక దీపంలో వంటలక్క నిన్న మొన్నటి వరకు ప్రతి ఎపిసోడ్‌కు రూ. 30 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటుందనేది ఇండస్ట్రీ టాక్. ఇపుడు రూ. 50 వేలకు పెంచినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో రెమ్యునరేషన్ పెరిగిన యాంకర్స్‌లో ప్రేమి విశ్వనాథ్ ఒకరు. రీసెంట్గా ఈ సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. (Twitter/Photo)