ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం తెలుగులో కాస్తా అవకాశాలు మందగించిన.. తమిళంలో మహిళా ప్రధాన ఇతివృత్తాల్లో నటిస్తూ సత్తాచాటుతోంది. Photo: Instagram
అది అలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు 'జెర్సీ' చిత్ర తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు తెలిసింది. నాని ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతూ హృదయాన్ని తడిమే భావోద్వేగాలతో రూపొందింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. Photo: Instagram