Triple Role Heroes | Triple Role Heroes | స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే జనాలు..ఒకే రకంగా ఇద్దరు హీరోలను చూస్తే డబుల్ ఖుషీ అవుతారు. ఇక త్రిపుల్ రోల్ చేస్తే ఆ ఆనందాని అవధులు ఉండవు. ఈ రకంగా ఒకే సినిమాలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసి మెప్పించిన హీరోల్లో ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ కాకుండా చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ లిస్టులో కళ్యాణ్ రామ్ చేరాడు. ఈయన హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీలో తొలిసారి మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఈయన కంటే త్రిపాత్రాభినయంలో మెప్పించిన హీరోలు ఎవరున్నారంటే.. (File/Photo)
కళ్యాణ్ రామ్ | ‘అమిగోస్’ మూవీలో తొలిసారి మూడు పాత్రల్లో కనిపించనున్నారు. డోపెల్ గాంగర్స్.. అంటే ఒకే రకంగా ఉండే రక్త సంబంధం లేని వ్యక్తులు అని అర్ధం. ఇందులో మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్, సిద్ధర్ధ్ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపంచనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మూడు పాత్రలతో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి. (Twitter/Photo)
Chiranjeevi | ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన మెగాస్టార్ చిరంజీవి. కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన మేర విజయం సాధించలేదు.ఈ చిత్రంలో చిరంజీవి,.. పృథ్వీ అనే లారీ డ్రైవర్‌గా, విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ అనే డాన్సర్ పాత్రలో నటించారు. (Youtube/Credit)
Nandamuri Balakrishna (NBK) : ‘అధినాయకుడు’లో తాతా,తండ్రి,మనవడుగా మూడు పాత్రల్లో నటించిన బాలకృష్ణ. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో హరిశ్చంద్ర ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్, బాబీ అనే తాత, తండ్రి, మనవడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించినా ఈ సినిమా ఆశించిన మేర ఫలితం అందుకోలేదు. (Youtube/Credit)
NTR (Nandamuri Taraka RamaRao) | సీనియర్ ఎన్టీఆర్ కులగౌరవం, శ్రీకృష్ణసత్య, శ్రీమద్విరాట పర్వం వంటి సినిమాల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసారు. ‘కులగౌరవం’ సినిమాలో ఎన్టీఆర్ తాత, తండ్రి, మనవడిగా నటిస్తే.... దానవీరశూరకర్ణల శ్రీకృష్ణుడిగా, దుర్యోదనుడిగా, కర్ణుడిగా మూడు పాత్రల్లో మెప్పించడం విశేషం. (Youtube/Credit)
Super Star Krishna | తెలుగులో సహా ప్రపంచ సినీ చరిత్రలో ఎక్కువ సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన హీరో కృష్ణ. ఈ నట శేఖరుడు కుమార రాజా, పగపట్టిన సింహం, రక్త సంబంధం, బంగారు కాపురం, బొబ్బిలిదొర, డాక్టర్ సినీ యాక్టర్, సిరిపురం మొనగాడు వంటి దాదాపు ఏడు సినిమాల్లో మూడు పాత్రల్లో మెప్పించడం విశేషం.(Youtube/Credit)