Triple Role Heroes | స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే జనాలు..ఒకే రకంగా ఇద్దరు హీరోలను చూస్తే డబుల్ ఖుషీ అవుతారు. ఇక త్రిపుల్ రోల్ చేస్తే ఆ ఆనందాని అవధులు ఉండవు. ఈ రకంగా ఒకే సినిమాలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసి మెప్పించిన హీరోల్లో ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ కాకుండా చాలా మందే ఉన్నారు. ఇపుడీ లిస్టులో రామ్ చరణ్ కూడా జాయిన్ అవుతున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. (File/Photos)
Chiranjeevi | ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన మెగాస్టార్ చిరంజీవి. కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన మేర విజయం సాధించలేదు.ఈ చిత్రంలో చిరంజీవి,.. పృథ్వీ అనే లారీ డ్రైవర్‌గా, విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ అనే డాన్సర్ పాత్రలో నటించారు. (Youtube/Credit)
NTR (Nandamuri Taraka RamaRao) | సీనియర్ ఎన్టీఆర్ కులగౌరవం, శ్రీకృష్ణసత్య, శ్రీమద్విరాట పర్వం వంటి సినిమాల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసారు. ‘కులగౌరవం’ సినిమాలో ఎన్టీఆర్ తాత, తండ్రి, మనవడిగా నటిస్తే.... దానవీరశూరకర్ణల శ్రీకృష్ణుడిగా, దుర్యోదనుడిగా, కర్ణుడిగా మూడు పాత్రల్లో మెప్పించడం విశేషం. (Youtube/Credit)