Triple Role Heroes | స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే జనాలు..ఒకే రకంగా ఇద్దరు హీరోలను చూస్తే డబుల్ ఖుషీ అవుతారు. ఇక త్రిపుల్ రోల్ చేస్తే ఆ ఆనందాని అవధులు ఉండవు. ఈ రకంగా ఒకే సినిమాలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసి మెప్పించిన హీరోల్లో ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ కాకుండా చాలా మందే ఉన్నారు. ఓ లుక్కేద్దాం... (File/Photos)
బాలకృష్ణ.. ఇపుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న ‘అఖండ’ మూడు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్టు ఈ సినిమా పోస్టర్స్‌ను చూస్తే తెలుస్తుంది. మూడు విభిన్న పాత్రలు చేస్తున్నారా.. ? మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారా అనేది డిసెంబర్ 2న తేలిపోనుంది. ఈ మూవీలో మూడు విభిన్న గెటప్స్‌లో బాలయ్య లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)