Mimi Chakraborty: ఎంపీ మిమి చక్రబర్తికి అస్వస్థత.. నకిలీ టీకా వేసుకున్నాక క్షీణించిన ఆరోగ్యం

Mimi Chakraborty: మన దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఊపందుకుంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు ఇస్తున్నారు. ఈ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది. ఐతే కరోనా నుంచి కాపాడే ఈ వ్యాక్సిన్ విషయంలోనూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ టీకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏకంగా ఓ ఎంపీనే నకిలీ టీకా తీసుకొని అస్వస్థతకు గురయ్యారు.