Heroines Dual Role: మామూలుగా స్టార్ హీరోల సినిమాలకు మరింత క్రేజ్ రావడానికి రెండు పాత్రలతో తెరకెక్కిస్తారు. అలా ఒకేసారి రెండు పాత్రలలో చూసినప్పుడు బాగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఎక్కువ హీరోలే కాకుండా అప్పుడప్పుడు హీరోయిన్స్ కూడా మెప్పిస్తారు. ఇప్పటివరకు పలు హీరోయిన్స్ ద్వి పాత్రలలో నటించగా వాళ్ళేవరో తెలుసుకుందాం.
అనుష్క: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తన పాత్రలతో బాగా మెప్పించింది. ఇక అరుంధతి సినిమాలో రెండు పాత్రలో నటించిన అనుష్క రెండు పాత్రలతో బాగా ఆకట్టుకుంది.అంతే కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా ద్విపాత్రలతో మెప్పించింది. ప్రస్తుతం ఓ సినిమాలలో చిన్న పాత్రలో కనిపించనుంది.