Top Tollywood Pre Release Theatrical Business : ఈ యేడాది వరుసగా భీమ్లా నాయక్, రాధే శ్యామ్, సినిమాలు వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తెలుగులో ఏకంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. అటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా లైగర్ కూడా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..
1. RRR | రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో ఆలియా భట్, ఓలివియా మోరీస్, సముద్ర ఖని ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఇప్పటకీ రూ. 600 కోట్ల షేర్ (రూ. 1114 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ పరంగా టాప్ 1లో ఉంది. (Twitter/Photo)
2) Bahubali 2 | ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి 2’. ఈ సినిమా అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డులకు ఎక్కడమే కాక.. బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. (Twitter/Photo)
4) రాధే శ్యామ్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన సినిమా రాధే శ్యామ్. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు. కరోనా కారణంగా ఏడాదిగా ఈ సినిమా వాయిదా పడుతుంది. ఇప్పుడు మార్చ్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తెలుగులో రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ’రాధే శ్యామ్’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అనిపించకోవాలంటే.. రూ. 204 కోట్లు వసూళు చేయాలి. ప్రభాస్ నటించిన గత సినిమాలు బాహుబలి, సాహో మూవీలతో పోలిస్తే చాలా వెనకబడిందనే చెప్పాలి. (Twitter/Photo)
7) ఆచార్య | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో టాప్ 7లో ఉంది. (Twitter/Photo)
11) బాహుబలి 1 | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి ఫస్ట్ పార్ట్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో తొలిసారి వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)