Indian Crush: ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అంటే అందం, నటనతోనే కాకుండా అభిమానులను మరింత క్రేజ్ తో ఆకట్టుకుంటారు. మరింత ఫాలోయింగ్ ను పెంచుకుంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింత సందడి చేస్తుంటారు సెలబ్రిటీస్. ఇదిలా ఉంటే సినీ పరిశ్రమలో కాకుండా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా సెలబ్రిటీస్ స్పెషల్ గుర్తింపు లతో పేరు తెచ్చుకుంటున్నారు. అది కూడా నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అంటూ.. కొంతమంది సెలబ్రెటీలను ఎంపిక చేశారు నెటి జనులు. ఇంతకు వాళ్లెవ్వరో చూద్దాం..
టాలీవుడ్ నటి కన్నడ గ్లామర్ బ్యూటీ రష్మిక మందన పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కిరాక్ పార్టీ సినిమా తో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ గీత గోవిందం సినిమా తో మంచి గుర్తింపు అందుకుంది. బాలీవుడ్ అవకాశాలు అందుకుంటూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. మొత్తానికి క్రష్ ఆఫ్ ఇండియా గా మారింది.
కన్నుగీటి తో అభిమానులను ఫిదా చేసిన బ్యూటీ ప్రియా వారియర్.. ఒక కన్ను గీటి తో దేశవ్యాప్తంగా ఫిదా చేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. అంతేకాకుండా నితిన్ సరసన చెక్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ మరో యంగ్ హీరో తో ఇష్క్ సినిమాల్లో నటించింది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఒక కన్నుగీటి తో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా నెటి జనులతో అనిపించుకుంటుంది.
సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన శెర్లి సెటియా. యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ తో తన స్టెప్పులతో అభిమానులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన గ్లామర్ తో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. మొత్తానికి కవర్ సాంగ్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీకి తన ఫాలోవర్స్ నేషనల్ క్రష్ అని పిలుచుకుంటున్నారు.
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. ఎంఎస్ ధోని సినిమాలో ఎంతో క్యూట్ గా కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ సరసన నటించి బాగా ఆకట్టుకుంది. ఇక తన గ్లామర్ లుక్ లతో, బికినీ అందాలతో యువతను కన్నార్పకుండా చేసిన బ్యూటీ ఇండియన్ క్రష్ లో చేరింది.