యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు నుంచి కుమ్మెస్తోంది. వరుసగా నాలుగు రోజులు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. రీసెంట్గా ఈ సినిమా రూ. 1160 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ ఓవరాల్ కలెక్షన్స్ క్రాస్ చేసి ఔరా అనిపిందిచింది. మొత్తంగా మన దేశంలో ఎక్కువ వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు మరోసారి వార్తల్లో వచ్చాయి. (Twitter/Photo)
2.బాహుబలి 2: ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈమె సంచలన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు వసూలు చేసి భారతీయ బాక్సాఫీస్ దగ్గర రెండో అతిపెద్ద విజయంగా నిలిచింది. కానీ మన దేశ బాక్సాఫీస్ విషయానికొస్తే.. ఇప్పటికే బాహుబలి 2 టాప్‌లో ఉంది. 2017లో విడుదలైన బాహుబలి 2 అప్పటి వరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది. మన దేశంలో ఎక్కువ వసూళ్లను సాధించిన సినిమాగా ఇప్పటికే బాహుబలి 2 రికార్డు చెక్కు చెదరలేదు.
3. KGF Chapter 2 | యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే నాలుగు రోజుల్లో (రూ. 277.17 కోట్ల షేర్ ) 557.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా ఈ సినిమా 25 రోజుల్లో రూ. 1162.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒక ఈ సినిమా టాప్ 10 కింద స్థాయి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాను క్రాస్ చేసి టాప్ 3కు చేరడం విశేషం. (Twitter/Photo)
4.RRR ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా మూడు రోజుల్లోనే రూ. 500 కోట్లు వసూలు చేసింది. రెండు వారాల్లోపే ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరింది. తాజాగా ఈ సినిమా రూ. 1131.90 కోట్లు గ్రాస్ వసూళ్లతో టాప్ 3 నుంచి టాప్ 4కి పడిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ 2 నుంచి 4 వరకు మూడు సినిమాలు సౌత్ సినిమాలు ఉండటం విశేషం.(Twitter/Photo)
6.సీక్రెట్ సూపర్ స్టార్: అమీర్ ఖాన్ అతిథి పాత్ర చేసిన ఈ సినిమా ఇండియాలో కేవలం 80 కోట్లు మాత్రమే వసూలు చేసింది కానీ చైనాలో ఈ సినిమా 800 కోట్లకు పైగా వసూలు చేసింది. అద్వైత్ చందన్ తెరకెక్కించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాను అమీర్ ఖాన్ సొంత ప్రొడక్షన్లో నిర్మించాడు. ఈ సినిమా 2017లో విడుదలైంది రూ. 831 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది సీక్రెట్ సూపర్ స్టార్.
17. అంధాదున్ | టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో నటించని సినిమా ‘అంధాదున్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 410 కోట్లు వసూళు చేసింది. ఈ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాను తెలుగులో నితిన్, తమన్నా ప్రధాన పాత్రలో ‘మ్యాస్ట్రో’గా రీమేక్ చేసారు. (Twitter/Photo)
20. సింబా.. | రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘సింబా’. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 385 కోట్లు వసూళు చేసింది 19వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
21. కబీర్ సింగ్.. | షాహిత్ కపూర్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కబీర్ సింగ్’. ఈ సినిమా తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీకి రీమేక్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 375 కోట్లు వసూళు చేసింది.ఈ సినిమా 20వ స్థానంలో నిలిచింది. (File/Photo)