ప్రస్తుతం బుల్లితెర లో ప్రసారమయ్యే సీరియల్స్ సినిమాలకంటే ఎక్కువ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాయి. ఇప్పుడున్న సమాజంలో చాలామంది సీరియల్స్ కు బాగా అలవాటు పడ్డారు. కారణం సీరియల్స్ సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రసారం అవుతుండగా.. ఆ తర్వాత జరిగే ఎపిసోడ్ కు కాస్త సస్పెన్స్ గా మారగా.. ప్రేక్షకులందరూ సీరియల్స్ వైపే ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే పలు సీరియల్స్ ద్వారా టీవీ చానల్స్ కు ఎక్కువ టిఆర్పీ కూడా వస్తుంది. దీంతో మరింత రేటింగ్ కోసం ప్రతిరోజు కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నారు దర్శకులు. అంతేకాకుండా బుల్లితెర లో నటించే నటుల పాత్రలు, వారి నటలను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అన్ని సీరియల్స్ తో పోలిస్తే టాప్ ఫైవ్ లో ఉన్న సీరియల్స్ మాత్రం బాగా ఆసక్తిగా ఉండటంతోపాటు ఎక్కువ రేటింగ్ ను కూడా అందిస్తున్నాయి. ఇంతకీ ఆ సీరియల్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా జీ తెలుగు లో ప్రసారమయ్యే సీరియల్ తీసుకున్నట్లయితే.. ప్రేమ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న సీరియల్ 'ప్రేమ ఎంత మధురం'. ఈ సీరియల్ టాప్ వన్ ప్లేస్ లో ఉండగా ఎంతో మంది ప్రేక్షకులను వాలిపోయేలా చేసింది. ఈ సీరియల్ లో వయసుతో సంబంధం లేకుండా ప్రేమ లో పడటం.. అంతేకాకుండా వారిద్దరి మధ్య రోజురోజుకు ప్రేమ ఎక్కువ అవడం.. ఇలా ఎంతో ఆసక్తికరంగా ఉండగా.. ఎక్కువగా యూత్ మాత్రం ఈ సీరియల్ కు దగ్గరయ్యారని తెలుస్తోంది.
ఇంటింటి గృహలక్ష్మి... ఈ సీరియల్ లో ఓ గృహలక్ష్మి తనలో ఎంత బాధ ఉన్నా.. తన కుటుంబం వల్ల తాను పడే కష్టాలు గురించి ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అంతేకాకుండా ఆ గృహలక్ష్మి భర్త మరో స్త్రీ తో సంబంధం పెట్టుకున్నా కూడా.. ఆ గృహ లక్ష్మి ఓపికతో ఉండటమే ఆమె గొప్పతనం. ఇక ఈ సీరియల్ కూడా టిఆర్పీ రేటింగ్ లో ముందు స్థానంలో ఉంది.