Top 5 Telugu Serials: ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమాల కంటే కూడా సీరియల్సే ఎక్కువగా చూస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆడవాళ్ళతో పాటు మగవారు కూడా సీరియల్స్‌కి అభిమానులు అయ్యారు. ఏమైనా అంటే చాలు.. మా వదినమ్మ.. మా వంటలక్క అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఇక అలానే ప్రస్తుతం తెలుగు టాప్ 5 సీరియల్స్ లిస్ట్ చూడగా అన్ని కూడా స్టార్ మా సీరియల్సే ఉన్నాయ్. ఆ సీరియల్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
కార్తీక దీపం: అప్పట్లో చక్రవాకం, మొగలిరేకులు సీరియల్ రేంజ్లో కార్తీకదీపం సీరియల్ అద్భుతమైన టీఆర్పీతో దూసుకుపోతుంది. గత రెండేళ్లుగా బుల్లితెరపై సూపర్ హిట్ సీరియల్ కార్తీకదీపం. అందుకే ఒకే కథను ఇన్ని రోజుల నుంచి సాగదీస్తున్న అభిమానులు మాత్రం మా వంటలక్క అంటూ టాప్‌లోనే పెట్టారు. ఇక ఓ హైదరాబాదీ మహిళ అయితే భూకంపం వచ్చిన వంటలక్క సీరియల్ చూడలేదని ఏడ్చింది అంటే అర్థం చేసుకోండి కార్తీకదీపం సీరియల్ రేంజ్ ఏంటి అనేది.(Photo: Star Maa)
ఇంటింటి గృహలక్ష్మి: స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం ఎంతో ఉత్కంఠంగా సాగుతుంది. అత్త, మామ, భర్త, కొడుకులు, కోడలు, పిల్లలు అంటూ తిరిగే గృహలక్ష్మి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. భర్త మరో ఆమెతో ఉండడం అందుకు పిల్లలు సపోర్ట్ చెయ్యడం, తర్వాత వారు తల్లి విలువ తెలుసుకోవడం అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Photo: Star Maa)
వదినమ్మ: 387 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ను ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్‌గా రానిస్తున్నారు. ఈ సీరియల్లో ఒక సమస్య తీరింది అనుకునే సమయానికి మరో పెద్ద సమస్య తెర మీదకు వస్తుంది. సమస్య వచ్చిన అందరూ సంతృప్తి పడేలా ఏదో ఒక పరిష్కారం తీసుకొచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నారు.(Photo: Star Maa)
దేవత: ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయ్. ప్రారంభంలో ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్లలకు సపోర్ట్ ఇచ్చే అత్తలా కనిపించిన తర్వాత ఆమెలో స్వార్థం చూపిస్తున్నారు. ఇటువైపు భర్త ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెను దూరం పెట్టడంతో ఈ సీరియల్ కూడా ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతుంది.(Photo: Star Maa)
చెల్లెలి కాపురం: సవతి తల్లి కూతురు అంటే చెల్లి పెళ్లి కోసం మతిస్థిమితం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని అతన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది భూమి. పాత్ర పేరుకు తగ్గట్టుగానే భూదేవి అంత ఓర్పు ఆమెకు ఉంది. భర్తను చిన్నపిల్లాడిలా చూసుకుంటూ అతని చుట్టూ ఉన్న సమస్యలను తరిమికొడుతుంది. ఇలా మంచి కథనాలతో.. మంచి నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ సీరియల్స్‌ని సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాప్ టీఆర్పీ సీరియల్స్ అంటే స్టార్ మా సీరియల్స్ అని గుర్తింపు వచ్చేలా సీరియల్స్ కొనసాగుతున్నాయ్.(Photo: Star Maa)